టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఉదయం ఇంటి నుంచి సచివాలయానికి వచ్చిన తలసానికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 

టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఉదయం ఇంటి నుంచి సచివాలయానికి వచ్చిన తలసానికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ప్రత్యేక పూజల అనంతరం ఆయన తన ఛాంబర్లో రాష్ట్ర పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ, మత్స్యశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తలసానికి మరో మంత్రి మల్లారెడ్డి, ఉన్నతాధికారులు, ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.

2019-20 సంవత్సరంలో 21,189 నీటి వనరులలో 80.69 కోట్ల చేప పిల్లల విడుదలకు సంబంధించిన ఫైలుపై తలసాని తొలి సంతకం చేశారు. 

"