అందుకే చేపమందు పై నమ్మకం పెరిగింది : తలసాని

Talasani says fish medicine is very popular
Highlights

ఘనంగా ఏర్పాట్లు

చేపమందు ప్రసాదాన్ని 173 ఏండ్ల నుంచి బత్తిన కుటుంబం పంపిణీ చేస్తోందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. అందుకే చేపమందు మీద ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపమందు పంపిణీని మంత్రి తలసాని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో చేప ప్రసాదాన్ని తీసుకునేందుకు జనాలు వస్తుంటారని అన్నారు. ప్రజలకు చేప ప్రసాదంపై నమ్మకం పెరిగింది కాబట్టే ఎక్కువ మంది వస్తున్నారని అన్నారు. చేపమందు పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసిందన్నారు. వర్షం ఇబ్బంది లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. అన్ని శాఖలను అనుసంధానం చేసి జాగ్రత్తలను తీసుకున్నామన్నారు. ఎన్ని వేల మంది వచ్చినా ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. చేప ప్రసాదం పై సీఎం కేసీఆర్ సైతం జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారని అన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు కలిగితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

loader