Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. కేంద్రం వల్లేనన్నతలసాని

కొన్ని సమయాల్లో ముఖ్యమంత్రి ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కరోనా కట్టడి కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని బీజేపీ నేతలు గుర్తెరగాలని హితవు పలికారు. 

Talasani Centre to blame for cases spike
Author
Hyderabad, First Published Jun 17, 2020, 9:49 AM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకీ విజృంభిస్తున్నాయి. ప్రతి రోజూ 200 లకు పైగా కొత్త కేసులు నమోదౌతున్నాయి. కాగా..  రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే కేసులు పెరుగుతున్నాయంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాగా...  వీటిపై తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.

కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం  తీసుకుంటున్న చర్యలను కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రశంసిస్తుండగా, స్థానిక బీజేపీ నేతలు  తమ స్వప్రయోజనాల కోసం  ప్రభుత్వం పై  విమర్శలు చేస్తున్నారని  తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. సడలింపుల విషయంలో  కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. 

కొన్ని సమయాల్లో ముఖ్యమంత్రి ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కరోనా కట్టడి కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని బీజేపీ నేతలు గుర్తెరగాలని హితవు పలికారు. 

రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. నిజంగా ప్రజలపై బీజేపీ నేతలకు ప్రేమ ఉంటే సడలింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ను ప్రశ్నించాలని సవాల్ చేశారు.

దేశంలో లాక్ డౌన్ సడలించింది ప్రధాని నరేంద్రమోదీ అన్న విషయం గుర్తించుకోవాలని తలసాని పేర్కొన్నారు. దేశంలో మద్యం దుకాణాలు తెరించింది కూడా కేంద్ర ప్రభుత్వమేనని అన్నారు. విమానాలు తిరగాలి అన్న నిర్ణయం తీసుకుంది కూడా కేంద్రమేనన్న విషయం గుర్తించుకోవాలని చెప్పారు. వీటి వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios