ఓ మహిళ తన బావతో చనువుగా ఉంటోదన్న అనుమానంతో ఓ బావ మరిది ఆమెను మానసికంగా వేధించాలని భావించాడు. దీని కోసం సోషల్ మీడియాను, టెక్నాలజీని ఉపయోగించుకున్నాడు. తరువాత పోలీసులకు చిక్కాడు.
టెక్నాలజీ పెరిగే కొద్దీ క్రైమ్స్ చేసే పద్దతులు కూడా మారిపోతున్నాయి. ఇందులో ఎదుటి వారిని మోసం చేసి డబ్బులు తీసుకుందామని చేసే సైబర్ క్రైమ్స్ కొన్నయితే, వేరొకరిని మానసిక క్షోభకు గురి చేసి ఆనందాన్ని పొందాలనుకొని చేసే క్రైమ్స్ మరికొన్ని.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. టెక్నాలజీని మంచి పనులకు ఉపయోగించుకునే వారికన్నా.. చెడు పనులకు ఉపయోగించుకునే ఎక్కువవుతున్నారు.
ఓ మహిళ ఫొటోలు సేకరించి..
ఓ మహిళ తన బావతో చనువుగా ఉంటోదన్న అనుమానంతో ఓ బావ మరిది ఆమెను మానసికంగా వేధించాలని భావించాడు. దీని కోసం సోషల్ మీడియాను, టెక్నాలజీని ఉపయోగించుకున్నాడు. ముందుగా ఆ మహిళ సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఆమె ఫొటోలు సేకరించాడు. ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాడు. పెరిగిన టెక్నాలజీ వల్ల అందుబాటులోకి వచ్చిన ఫొటో ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ ల ద్వారా ఆ మహిళ ఫొటోలను మార్పింగ్ చేశాడు. ఆమె ఫొటోలను ఫీ మేల్ ఎస్కార్ట్ గా తీర్చిదిద్దాడు. వాటిపై కొన్ని అశ్లీలమైన కామెంట్స్ రాసి ఆ ఫొటోలను ఆన్ లైన్ లో పెట్టాడు. దీంతో ఆమెకు ఎక్కడికెక్కడి నుంచో ఫోన్లు రావడం ప్రారంభమయ్యాయి. మెసేజ్‌లు కూడా రావడం మొదలయ్యాయి.
కొత్తగా కాల్స్, మెసేజ్‌లు ఎందుకు వస్తున్నాయో ఆ మహిళకు అర్జం కాలేదు. వెంటనే ఆమె సైబర్ క్రైమ పోలీసుల వద్దకు వెళ్లింది. ఈ విషయంలో ఫిర్యాదు చేసింది. కేసును రాచకొండ సైబర్ క్రైమ్స్ ఏసీపీ ఎస్.హరినాథ్ దర్యాప్తు చేశారు. దీనిని ఛేదించడం కోసం టెక్నాలజీని వాడుకున్నారు. దీనిని గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి చేస్తున్నారని గుర్తించారు. మంచికల్లు నుంచి ఓ స్టూడెంట్ మేకల శేషు వెంకట కృష్ణ (20) ఈ పని చేశాడని పోలీసులు నిర్ధారించారు. దీంతో అతడిని అరెస్ట్ చేశారు.
టెక్నాలజీని చెడు పనులకే ఎక్కువగా..
నేటి కాలంలో పెరిగిన టెక్నాలజీని మంచి చేయడం కంటే చెడు చేయడానికే ఎక్కువగా వాడుతున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా ఎంతో సమాచారం సేకరించవచ్చు. మనకు ఎలాంటి కంటెంట్ కావాలని సెర్చ్ చేస్తే అలాంటి కంటెంట్ క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. ఈ టెక్నాలజీని కొత్త విషయాలు నేర్చుకోవడం, తెలుసుకోవడం, వంటలు నేర్చుకోవడం వంటి మంచి పనుల కోసం కొందరు ఉపయోగిస్తుంటే.. మరి కొందరు మాత్రం దానిని చెడ్డపనుల కోసం ఉపయోగిస్తున్నారు. ఈజీ మనీ ఎలా సంపాదించాలో తెలుసుకోవడానికి, అలాగే క్రైమ్స్, అశ్లీలత కంటెంట్ ను చూడటానికి కొందరు వాడుతున్నారు.
