Asianet News TeluguAsianet News Telugu

 ఈ ఎన్నికలలో వెనక్కి తగ్గకండి.. జనసేనానికి తెలంగాణ నాయకుల విజ్ఞప్తి

తెలంగాణ శాసన సభ ఎన్నికలలో జనసేన పోటీ చేయవలసిందేనని జనసేన తెలంగాణ నాయకులు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులతో జనసేనాని సమావేశం అయ్యారు. 

T Janasena leaders appeal to Pawan Kalyan that Janasena should contest in Telangana Assembly elections KRJ
Author
First Published Oct 18, 2023, 6:49 AM IST | Last Updated Oct 18, 2023, 6:49 AM IST

తెలంగాణ శాసన సభ ఎన్నికలలో జనసేన పోటీ చేయవలసిందేనని జనసేన తెలంగాణ నాయకులు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి విజ్ఞప్తి చేశారు. మంగళవారం నాడు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో సమావేశంలో పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ జనసేన నాయకులతో ప్రత్యేక సమావేశం అయ్యారు. తెలంగాణాలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలా? లేదా ? అనే విషయంపై జన కార్యకర్తల, నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. 

2018లో కొత్త రాష్ట్రంలో రాజకీయ గందరగోళానికి తావివ్వరాదన్న ఉద్దేశంతో పోటీ చేయరాదన్న అధ్యక్షుని అభిప్రాయాన్ని తాము గౌరవించామనీ, పోటీ నుండి తాము విమరించుకున్నామని అన్నారు. అలాగే..  మిత్రపక్షమైన బి.జె.పి. విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో పోటీ నుంచి విరమించుకున్నామని, కానీ, ఈ సారి తప్పనిసరిగా పోటీచేయవలసిందేనని జన కార్యకర్తలు డిమాండ్ చేశారు. చాలా రోజుల నుంచి ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నామని, ఈ దఫా పోటీ చేయకపోతే తెలంగాణాలో పార్టీ ఎదుగుదలను చేతులారా ఆపుకున్నట్లేనని కార్యకర్తలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

ఈ సారి విరమించుకుంటే.. ప్రజల ముందుకు భవిషత్తులో బలంగా వెళ్లడం కష్టమేనని, క్యాడర్ నిరుత్సాహానికి గురవుతారని స్పష్టం చేశారు. నేతల అభిప్రాయాలను విన్న పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పరిస్థితులను తానూ | చేసుకోగలని, అయితే తన మీద ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని, అయితే నాయకులు, జన సైనికులు, వీర మహిళల అభిప్రాయాలను గౌరవిస్తానని అన్నారు.

సరైన నిర్ణయం తీసుకోడానికి ఒకటిరెండు రోజుల సమయం అవసరమని తెలిపారు. పరిస్థితులు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉన్నందున సానుకూల నిర్ణయం తీసుకోవాలని  పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ బి.మహేందర్ రెడ్డి, తెలంగాణ శాఖ ఇంచార్జి శ్రీ వేమూరి శంకర్ గౌడ్, రాష్ట్ర నాయకులు శ్రీ రామ్ తాళ్లూరి, హైదరాబాద్ నగర అధ్యక్షుడు శ్రీ ఆర్.రాజలింగం, ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం.దామోదర్ రెడ్డి, వివిధ నియోజకవర్గాల ఇంచార్జీలు పాల్గొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios