హైదరాబాద్: గాంధీభవన్ లో తనపై కొందరు కావాలనే కుట్ర చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి. తాను కాంగ్రెస్ పార్టీని వీడతానని బీజేపీలో చేరబోతున్నట్లు చేస్తున్న ప్రచారాన్ని విజయశాంతి ఖండించారు. అయితే ఆ ప్రచారం గాంధీభవన్ నుంచే ప్రారంభమైందని తెలిపారు. 

తనపై వస్తున్న ప్రచారంపై తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించినట్లు తెలిపారు. తాను బీజేపీలో చేరే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో హడావిడి నిర్ణయాలు తీసుకోననని విజయశాంతి స్పష్టం చేశారు. పార్టీ మారాలనుకుంటే బహిరంగంగానే ప్రకటిస్తానంటూ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలపట్ల విజయశాంతి గుర్రుగా ఉన్నారని ఆమె పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతూ ఉంది.ఈ ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో విజయశాంతి స్పందించారు. 

ఇకపోతే విజయశాంతి ప్రస్తుతం వెండితెరపై బిజీబిజీగా గడుపుతున్నారు. దాదాపు 14ఏళ్లు విరామం అనంతరం ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనబడనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఈ లేడీ సూపర్ స్టార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 
 

ఈవార్తలు కూడా చదవండి

పార్టీ మార్పుపై తేల్చేసిన విజయశాంతి