అసెంబ్లీ రద్దు: కాంగ్రెస్ అలర్ట్...ముఖేశ్ ఇంట్లో అత్యవసర సమావేశం.. హాజరుకానీ జానా

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 5, Sep 2018, 10:44 AM IST
t congress emeregency meeting in mukesh goud house for early elections
Highlights

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు, అసెంబ్లీ రద్దు తదితర అంశాలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముందస్తుకు వెళ్లేందుకు టీఆర్ఎస్ చకచకా పావులు కదుపుతుండటంతో.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు, అసెంబ్లీ రద్దు తదితర అంశాలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముందస్తుకు వెళ్లేందుకు టీఆర్ఎస్ చకచకా పావులు కదుపుతుండటంతో.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలతో ముఖేశ్ గౌడ్ ఇంట్లో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, రేపు రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలు, అసెంబ్లీ రద్దయిన పక్షంలో.. ఎన్నికలకు ఎలా వెళ్లాలన్న దానిపై నేతలు చర్చించనున్నారు. కాగా, ఇంతటి ప్రాధాన్యత కలిగిన సమావేశానికి సీనియర్ నేత, సీఎల్పీ లీడర్ జానారెడ్డి గైర్హాజరుకానున్నారు. ఆయన కంటికి శస్త్ర చికిత్స చేయించుకోవడంతో  ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని.. అందువల్లే ఆయన ముఖేశ్ గౌడ్ ఇంట్లో భేటీకి రావడం లేదని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి.
 

loader