Asianet News TeluguAsianet News Telugu

ట్యాంక్‌బండ్‌పై కాంగ్రెస్ కొవ్వొత్తుల ర్యాలీ: ఉత్తమ్ అరెస్ట్, ఉద్రిక్తత

హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద గురువారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ హత్రాస్ అత్యాచార ఘటనను నిరసిస్తూ టీ కాంగ్రెస్ నేతలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.

t congress chief uttam kumar reddy arrest at tank band
Author
Hyderabad, First Published Oct 1, 2020, 7:33 PM IST

హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద గురువారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ హత్రాస్ అత్యాచార ఘటనను నిరసిస్తూ టీ కాంగ్రెస్ నేతలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. యోగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

క్యాండిల్ ర్యాలీని అడ్డుకున్నప్పటికీ నేతలంతా పట్టుబట్టి ముందుకు దూసుకెళ్లడంతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, కూన శ్రీశైలం గౌడ్, అంజనీ కుమార్ యాదవ్‌లను అదుపులోకి తీసుకున్నారు.

Also Read:తెలంగాణ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

ఇక అంతకుముందు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై యూపీ పోలీసుల దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్‌ నేత, ఆ పార్టీ ఎంపీ రేవంత్‌ రెడ్డి కార్యకర్తలతో కలిసి తెలంగాణ బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు.

కాంగ్రెస్‌ నేతల రాకపై సమాచారంతో బీజేపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చెలరేగింది. రేవంత్‌ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని గోషామహల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో కాంగ్రెస్‌ నేత అనిల్‌ యాదవ్‌పై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios