హైదరాబాద్  నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ కార్యాలయం వద్ద గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం ఘర్షణకు దారి తీసింది. అనిల్ యాదవ్‌పై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ఉత్తరప్రదేశ్‌ హత్రాస్ రేప్ ఘటన బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో రాహుల్‌పై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించాయి.

ఇదే సమయంలో గాంధీ భవన్‌వైపు బీజేపీ కార్యకర్తలు దూసుకొచ్చారు. రాహుల్‌కి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. పప్పు డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు.