Asianet News TeluguAsianet News Telugu

ఈడీ విచారణకు హాజరైన శ్వేత గ్రానైట్ సంస్థ ప్రతినిధి గంగుల వెంకన్న

శ్వేత  గ్రానైట్  కంపెనీకి చెందిన గంగుల  వెంకన్నను  ఇవాళ ఈడీ  అధికారులు  ప్రశ్నిస్తున్నారు. మూడు రోజుల క్రితం  ఆయనకు  నోటీసులు జారీ  చేశారు. ఈ నెల 9,10  తేదీల్లో  గ్రానైట్  సంస్థల్లో  ఈడీ  అధికారులు  సోదాలు  నిర్వహించిన  విషయం  తెలిసిందే

Swetha Granite owner Gangula Venkanna Appears Before Enforcement Directorate Probe
Author
First Published Nov 28, 2022, 2:28 PM IST

హైదరాబాద్: శ్వేత గ్రానైట్ కంపెనీకి  చెందిన గంగుల వెంకన్ను  సోమవారంనాడు  ఈడీ  అధికారులు ప్రశ్నిస్తున్నారు. మూడు రోజుల క్రితం శ్వేత  గ్రానైట్  సంస్థ  యాజమాన్యానికి  ఈడీ  అధికారులు  నోటీసుులు జారీ చేశారు.ఈ  నోటీసులు అందుకున్న  శ్వేత  గ్రానైట్  సంస్థకు  చెందిన  గంగుల  వెంకన్న  ఇవాళ  విచారణకు హాజరయ్యారు. గంగుల  వెంకన్న  నుండి  ఈడీ  అధికారులు  పలు  అంశాలపై  ప్రశ్నిస్తున్నారు.

ఈ  నెల  9,10  తేదీల్లో  తెలంగాణ  రాష్ట్రంలో  పలు  గ్రానైట్ సంస్థల్లో  ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. శ్వేత గ్రానైట్ , శ్వేత ఏజన్సీ,  వెంకటేశ్వర  గ్రానైట్స్,పీఎస్ఆర్ గ్రానైట్స్, గిరిరాజ్ షిప్పింగ్ సంస్థల్లో  ఈడీ  అధికారులు  సోదాలు నిర్వహించారు. హైద్రాబాద్, కరీంనగర్ లలో  సుమారు  30 టీమ్‌లు  సోదాలు  నిర్వహించారు. మంత్రి  గంగుల  కమలాకర్  సహా  టీఆర్ఎస్ కు చెందిన  ఎంపీ గాయత్రి రవికి చెందిన  గ్రానైట్ సంస్థల కార్యాలయాల్లో  కూడా  ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల  సందర్భంగా  రూ. 1.80 కోట్ల నగదును సీజ్  చేసినట్టుగా ఈడీ  ప్రకటించింది.  హవాలా  రూపంలో పెద్ద  మొత్తంలో  లావాదేవీలు  జరిగినట్టుగా  ఈడీ  ప్రకటించింది.

ఎగుమతి  చేసిన  గ్రానైట్ ను  తక్కువ  పరిమాణంలో చూపడం ద్వారా ప్రభుత్వానికి చెల్లించాల్సిన  బకాయిలను  ఎగ్గొట్టిందని  ఈడీ తెలిపింది.  సుమారు  రూ. 750 కోట్లను  గ్రానైట్  సంస్థలు  ఎగ్గొట్టాయని  కూడా  ఈడీ  ఈ నెల  11న  స్పష్టం చేసిన  విషయం  తెలిసిందే.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలోనే  గ్రానైట్  కంపెనీలపై  ఫిర్యాదులు అందాయి.ఈ  విషయమై సీబీఐ  కేసు నమోదు  చేసింది.ఈ  కేసు ఆధారంగా  ఈడీ రంగంలోకి దిగింది.  ఈ  నెల  9, 10  తేదీల్లో  ఈడీ, ఐటీ  అధికారులు  సంయుక్తంగా  సోదాలు  నిర్వహించారు.తెలంగాణ  మంత్రి  గంగుల  కమలాకర్ కు చెందిన  గ్రానైట్ కంపెనీల్లో  ఈడీ  అధికారులు సోదాలు జరిపిన  సమయంలో  ఆయన  దుబాయ్ లో  ఉన్నారు. ఈడీ  అధికారుల  సోదాల  విషయం తెలుసుకున్న  తర్వాత  ఆయన దుబాయ్ నుండి  కరీంనగర్ కు చేరుకున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios