ఉజ్జయిని మహంకాళి బోనాలు: ఆడపడుచులు దు:ఖంతో ఉన్నారు: రంగంలో స్వర్ణలత

swarnalatha in Bhavishyavani in Ujjaini mahankali temple
Highlights

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మాతంగి స్వర్ణలత సోమవారం నాడు రంగంలో భవిష్యవాణిని విన్పించారు.రెండు రోజులుగా ఉజ్జయిని మహంకాళి  అమ్మవారు బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని  భక్తులు పోటెత్తారు.

హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మాతంగి స్వర్ణలత సోమవారం నాడు రంగంలో భవిష్యవాణిని విన్పించారు.రెండు రోజులుగా ఉజ్జయిని మహంకాళి  అమ్మవారు బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని  భక్తులు పోటెత్తారు.

ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు ముగింపును పురస్కరించుకొని సోమవారం నాడు ఉదయం పూట  రంగం నిర్వహించారు. రంగంలో భాగంగా  మాతంగి స్వర్ణలత  భవిష్యవాణి విన్పించారు.

నా వద్దకు  ప్రజలు దు:ఖంతో వస్తున్నారని స్వర్ణలత చెప్పారు. ఈ ఏడాది సంతోషం లేకుండా పోయిందన్నారు.  తన ఆలయం వద్దకు వచ్చిన భక్తులు సంతోషంగా లేరని చెప్పారు.  బంగారు బోనం సమర్పించామని భక్తులంతా  ఆనందంగా ఉంటున్నారని  ఆలయ పూజారి చెప్పా,రు. భక్తులు సంతోషంగా ఉన్నారో.. సంతోషంగా ఉన్నారో తనకు తెలుసునని చెప్పారు.

గ్రామ ప్రజలను సంతోషంగా ఉండేలా చూసుకొంటాను.  మీరు భక్తులను ఇబ్బందిపెట్టకుండా చూడాలని ఆమె  ఆలయపూజారులు చెప్పారు.  పిల్లి శాపాలు పెట్టకూడదని  పూజారులు రంగంలో స్వర్ణలతను కోరారు. అయితే ప్రజలను సంతోష పెట్టే బాధ్యతను తీసుకొంటామని  స్వర్ణలత భవిష్యవాణిని ఇచ్చారు.

బంగారు బోనం కొంత సంతోషం.. బాధను కల్గిస్తోందని  స్వర్ణలత ప్రకటించారు. ఈ ఏడాది కోరినంత వర్షాలు కురుస్తాయని స్వర్ణలత ప్రకటించారు. పాడి పంటలు బాగా ఉంటాయని స్వర్ణలత ప్రకటించారు.ప్రతి ఏటా భక్తులు తన వద్దకు సంతోషంగా వస్తారని స్వర్ణలత చెప్పారు. కానీ, ఈ ఏడాది మాత్రం భక్తులకు సంతోషం లేకుండా పోయిందని చెప్పారు.ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నారు. భక్తులను సంతోషంగా ఉంచేలా చూసుకొనే బాధ్యత తీసుకొంటానని ఆమె చెప్పారు.

loader