కత్తి మహేష్ ఎఫెక్ట్: స్వామి పరిపూర్ణానంద హౌస్ అరెస్ట్

Swamy paripurnandha house arrested in hyderabad
Highlights

స్వామి పరిపూర్ణానందను రాచకొండ పోలీసులు సోమవారం నాడు హౌస్ అరెస్ట్ చేశారు. కత్తి మహేష్ వ్యాఖ్యలను నిరసిస్తూ స్వామి పరిపూర్ణానంద ధర్మాగ్రహ యాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.యాత్ర నిర్వహించకుండా స్వామిని హౌస్ అరెస్ట్ చేశారు.


హైదరాబాద్: స్వామి పరిపూర్ణానందను రాచకొండ పోలీసులు సోమవారం నాడు హౌస్ అరెస్ట్ చేశారు. సినీ విమర్శకుడు కత్తి మహేష్ శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ యాదాద్రి వరకు స్వామి పరిపూర్ణానంద ధర్మాగ్రహ యాత్రను తలపెట్టారు. అయితే ఈ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అంతేకాదు యాత్ర నిర్వహించకుండా ఉండేందుకు గాను స్వామి పరిపూర్ణానందను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

స్వామి పరిపూర్ణానంద ధర్మాగ్రహ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే పోలీసులు అనుమతి నిరాకరించినా తాను మాత్రం యాత్రను కొనసాగిస్తానని స్వామి పరిపూర్ణానంద ప్రకటించారు. అయితే ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పరిపూర్ణానందను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పరిపూర్ణానంద ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

సినీ విమర్శకులు కత్తి మహేష్ వ్యాఖ్యలను నిరసిస్తూ స్వామిజీ ఈ యాత్రను చేపట్టాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో పోలీసులు ఈ యాత్రకు అనుమతిని నిరాకరించారు.

శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్నారనే నెపంతో సినీ విమర్శకుడు కత్తి మహేష్ పై హైద్రాబాద్ పోలీసులు నగర బహిష్కరణ వేటు వేశారు.

loader