Asianet News TeluguAsianet News Telugu

సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ సీసీ గడిల విష్ణువర్ధన్‌ అనుమానస్పద మృతి..

సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ దగ్గర సీసీగా పని చేసే గడిల విష్ణువర్ధన్‌ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన మృతదేహం కొండాపూర్‌ మండలం తెలంగాణ టౌన్‌షిప్‌ వద్ద లభించిందని పోలీసులు తెలిపారు.

Suspicious death of Sangareddy Additional Collector CC Gadila Vishnuvardhan..ISR
Author
First Published Oct 29, 2023, 12:58 PM IST

సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ మాధురి దగ్గర క్యాంప్ క్లర్క్ (సీసీ)గా విధులు నిర్వహిస్తున్న 44 ఏళ్ల గడిల విష్ణువర్ధన్‌ చనిపోయారు. ఆయన మరణం అనుమానస్పద రీతిలో ఉంది. కొండాపూర్ మండలంలోని తెలంగాణ టౌన్ షిప్ దగ్గర కాలిన గాయాలతో సీసీ డెడ్ బాడీ లభించిందని పోలీసులు వెల్లడించారని ‘ఈనాడు’ పేర్కొంది.

విషాదం.. ఒకే ఇంట్లో ఏడుగురి కుటుంబ సభ్యుల సూసైడ్.. కారణమేంటంటే ?

గడిల విష్ణువర్ధన్‌ కి భార్య, ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. అయితే శనివారం మధ్యాహ్న నుంచి అతడు ఇంటికి చేరుకోలేదు. రాత్రి సమయంలో భార్య కృష్ణ కుమారి ఆయనకు కాల్ చేశారు. ఆ సమయంలో వారిద్దరు చివరి సారిగా మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. కాగా.. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆయన నెల రోజుల నుంచి లీవ్ లో ఉన్నారని సమాచారం.

కాంగ్రెస్ కు అధికారమిస్తే అంధకారమే అని ప్రజలకు అర్థమైంది - డీకే శివ కుమార్ కు కేటీఆర్ కౌంటర్..

అయితే ఆకస్మాత్తుగా ఆయన మరణించడంతో కుటుంబంలో విషాదం నింపింది. కాలిన గాయాలతో ఆయన చనిపోవడంతో అది హత్యా ? లేక ఆత్మహత్యా ? అనేది తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణ జరుపుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios