Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ కు అధికారమిస్తే అంధకారమే అని ప్రజలకు అర్థమైంది - డీకే శివ కుమార్ కు కేటీఆర్ కౌంటర్..

కర్ణాటక డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ శనివారం వికారాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. కాంగ్రెస్ కు ఓటేయాలని ప్రజలను కోరారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలను ఎక్స్ (ట్విట్టర్) పోస్టులో తెలంగాణ మంత్రి కేటీఆర్ తిప్పికొట్టారు.

People understand that giving power to Congress will be darkness - KTR's counter to DK Shivakumar..ISR
Author
First Published Oct 29, 2023, 12:05 PM IST

కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణ అంధకారంగా మారుతుందని రాష్ట్ర ప్రజలు కర్ణాటక దుస్థితిని చూసి అర్థం చేసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. వికారాబాద్ రోడ్ షోలో కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఈ విధంగా ఎక్స్ (ట్విట్టర్) వేధికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 24 గంటలు ఇచ్చే తెలంగాణకు వచ్చి కర్ణాటకలో 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటు అని విమర్శించారు.

విషాదం.. ఒకే ఇంట్లో ఏడుగురి కుటుంబ సభ్యుల సూసైడ్.. కారణమేంటంటే ?

‘‘డీకే గారు.. కర్ణాటక ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నా పట్టించుకోకుండా.. తెలంగాణలో ఓట్లు అడిగేందుకు వచ్చారు’’ అని  కేటీఆర్ విమర్శించారు. కర్ణాటక కు వస్తే తమ పథకాలు చూపిస్తామన్న శివ కుమార్ మాటలను కూడా మంత్రి కేటీఆర్ తిప్పికొట్టారు. మీ ఓటమిలను చూసేందుకు అక్కడి వరకు రావాల్సిన అవసరం లేదని.. అక్కడి రైతులే తెలంగాణకు వచ్చి కాంగ్రెస్ చేసిన అన్యాయాలను వివరిస్తున్నారని ఆరోపించారు. రైతులకు కాంగ్రెస్ వల్ల పొంచి ఉన్న ప్రమాదంపై తెలంగాణ ప్రజలకు వివరిస్తున్నారని దుయ్యబట్టారు.

వికారాబాద్ లో విషాదం.. కరెంట్ షాక్ తో ఇద్దరు రైతులు మృతి..

ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ప్రజలు క్షమించబోరని, తెలంగాణ ప్రజలు నమ్మబోరని మంత్రి కేటీఆర్ అన్నారు. ఐదు హామీల పేరు చెప్పి అర చేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు. తీరా గద్దెనెక్కిన తరువాత సవాలక్ష కొర్రీలతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు. ‘‘మీ గృహజ్యోతి పథకం గాలిలో దీపంలా ఆరిపోయింది. ఎడాపెడా కరెంట్ కోతలు.. చార్జీల వాతలతో కర్ణాటక చీకటిరాజ్యంగా మారిపోయింది. కనీసం ఐదుగంటలు కూడా కరెంట్ లేక అక్కడి రైతాంగమే కాదు.. రాష్ట్ర రాజధాని బెంగుళూరులో ఎడాపెడా పవర్ కట్ లతో  వాణిజ్య వ్యాపార సంస్థలు కూడా కష్టాల కడలి లో కొట్టుమిట్టాడుతున్నయి.’’ అని పేర్కొన్నారు. 

బాలికపై పోలీసు కానిస్టేబుల్ అత్యాచారయత్నం.. ఇంట్లోకి చొరబడి, ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో దుశ్చర్య..

‘‘మీ అన్నభాగ్య స్కీమ్ పూర్తిగా అటకెక్కింది. కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేక చేతులెత్తేసిన మీ కాంగ్రెస్ ప్రభుత్వ 
తప్పిదాలకు అక్కడి ప్రజలు అన్నమో రామచంద్ర అని అల్లాడిపోతున్నారు. రేషన్ పై కూడా సన్నబియ్యం ఇవ్వాలన్న మా సంకల్పానికి.. కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేని మీ అసమర్థ పాలనకు ఉన్న తేడాను తెలంగాణ సమాజం స్పష్టంగా అర్థం చేసుకుంది. ’’ అని కేటీఆర్ విమర్శించారు.

telangana weather : పగలు ఉక్కపోత.. రాత్రి గజగజ.. తెలంగాణలో విచిత్ర వాతావరణం..

‘‘మహిళలకు ఉచిత ప్రయాణం అని మభ్యపెట్టి మొత్తానికే కర్ణాటక ఆర్టీసిని దివాళా తీసిన విధానం ప్రజలకే కాదు.. అక్కడి ఉద్యోగులకు కూడా పెను ప్రమాదంగా మారింది. సబ్ స్టేషన్ల వద్ద మొసళ్లతో నిరసనలు.. కరెంట్ కోసం పురుగుల మందు తాగి రైతుల ఆత్మహత్య ప్రయత్నాలన్నీ కాంగ్రెస్ ఘోర పరిపాలనా వైఫల్యాలకు సజీవ సాక్ష్యాలు.’’ అని మంత్రి దుయ్యబట్టారు. ‘‘ మహిళల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామన్న మీ గృహలక్ష్మి హామీకి కూడా గ్రహణం పట్టింది. ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తానన్న ప్రధాని హామీలాగే  మీ హామీ కూడా గంగలో కలిసిపోయింది.’’ అని పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios