లోయర్ మానేర్ డ్యాంలో యువతి అనుమానాస్పద మృతి..
యువతి ఎప్పుడు మరణించింది. ఎలా మరణించింది అనేది పోస్ట్ మార్టం తర్వాతే తేలనుంది. ఈ ఘటనతో లోయర్ మానేర్ డ్యాం పరిసరాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మిస్సింగ్ కేసుల ఆధారంగా కేసు దర్యాప్తు చేయనున్నారు పోలీసులు. ఈతకు వెళ్లి ఊపిరాడక మరణించిందా లేక వేరే కారణాలనున్నాయనేది తేలాల్సి ఉంది.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోయర్ మానేరు డ్యాంలో గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. ఈ యువతి suicideకు పాల్పడిందా? లేక ఎవరైనా ఎక్కడైనా హత్యచేసిన Lower Manor Damలో పడేశారా అనేది తేలాల్చి ఉంది. యువతి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.
యువతి ఎప్పుడు మరణించింది. ఎలా మరణించింది అనేది Post mortem report తర్వాతే తేలనుంది. ఈ ఘటనతో లోయర్ మానేర్ డ్యాం పరిసరాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మిస్సింగ్ కేసుల ఆధారంగా కేసు దర్యాప్తు చేయనున్నారు పోలీసులు. ఈతకు వెళ్లి ఊపిరాడక మరణించిందా లేక వేరే కారణాలనున్నాయనేది తేలాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, హైరదాబాద్ నగరంలోని జీడిమెట్ల ఇంటర్ విద్యార్థి అదృశ్యం విషాదాంతమయ్యింది. గాజులరామారం చింతలచెరువు లో విద్యార్థి dead body లభ్యమైంది. ఈ నెల 22న షాపూర్ నగర్ కు చెందిన సుమిత్ కుమార్ (17) అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు ఇష్టంలేని కోర్సులో చేర్పించాలని మనస్తాపానికి గురైన సుమిత్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. నిన్న చింతల్ చెరువు వద్ద ఉన్న విద్యార్థి చెప్పులు ఆధారంగా గాలింపు చేపట్టిన పోలీసులు ఇవ్వాళ విద్యార్థి మృతదేహాన్ని గుర్తించారు.
నెహ్రూ జూ పార్క్‌లో యువకుడు హల్‌చల్: కాస్తలో తప్పిన ముప్పు.. సింహానికి ఆహారమయ్యేవాడే
అసలేం జరిగిందంటే..
షాపూర్ నగర్ లో నివాసం ఉంటున్న రమేష్ కుమార్ ప్రైవేట్ ఉద్యోగి. అతని కుమారుడు ఓ private collegeలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఫస్ట్ ఇయర్ లో అతనికి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు తీసుకోవాలని బలవంతం చేశారు. ఆ గ్రూపు లోనే తొలి ఏడాది చదువు పూర్తి చేశాడు. అయితే ఆ కోర్సు తనకు ఇష్టం లేదని రెండో ఏడాది కళాశాలకు వెళ్లనని చెప్పడంతో ఎంపీసీ నుంచి సిఈసి కి బదిలీ చేయించారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం సుమిత్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
Heavy rains in AP: ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ లేఖ, రూ. 1000 కోట్లివ్వాలని వినతి
ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడి బంధువులు స్నేహితుల వద్ద ఫలితం కనిపించలేదు. ఇ అదే రోజు సాయంత్రం విద్యార్థి తల్లిదండ్రులు policeకు ఫిర్యాదు చేశారు. missing case నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. షాపూర్ నగర్ నుంచి గాజులరామారం.. అక్కడి నుంచి గాజులరామారం వైపు వెళ్తున్నట్లు cc tv footage దృశ్యాలు కనిపించాయి. ఈ క్రమంలోనే నిన్న చెరువు వద్ద నిన్న విద్యార్థి చెప్పులు దొరికాయి.
దీంతో పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి చీకటి పడే వరకు గాలించినా ఆచూకీ లభించలేదు. మళ్లీ ఈ ఉదయం గాలింపు చర్యలు చేపట్టి విద్యార్థి మృతదేహాన్ని చెరువులో గుర్తించారు.