వారి డిమాండ్లను పట్టించుకోండి.. హోంగార్డు ఆత్మ‌హ‌త్య య‌త్నం పై రాజాసింగ్ కీల‌క వ్యాఖ్య‌లు

Hyderabad: సమయానికి జీతం ప‌డ‌క‌పోవ‌డంతో బ్యాంకుకు చెల్లించాల్సిన ఈఎంఐ చెల్లింపు ఆలస్యమైందనే మ‌న‌స్థాపానికి గురైన ఒక హోంగార్డు అధికారుల ముందే ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్న ఘటన హైద‌రాబాద్ లోని గోషామహల్‌ ప‌రిధిలో చోటుచేసుకుంది.
 

Suspended BJP MLA Raja Singh's key remarks on home guard's suicide attempt RMA

Suspended BJP MLA Raja Singh: సమయానికి జీతం ప‌డ‌క‌పోవ‌డంతో బ్యాంకుకు చెల్లించాల్సిన ఈఎంఐ చెల్లింపు ఆలస్యమైందనే మ‌న‌స్థాపానికి గురైన ఒక హోంగార్డు అధికారుల ముందే ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్న ఘటన హైద‌రాబాద్ లోని గోషామహల్‌ ప‌రిధిలో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ హోంగార్డుల డిమాండ్ల‌ను ప‌ట్టించుకోవాల‌ని ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) అన్నారు.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వద్ద పనిచేస్తున్న హోంగార్డు ఆత్మహత్యకు పాల్పడటంపై ఆందోళన వ్యక్తం చేసిన బీజేపీ నేత, ఎమ్మెల్యే టి.రాజాసింగ్ తెలంగాణ పోలీసు శాఖలో పనిచేస్తున్న హోంగార్డుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చత్రినాక ఉప్పుగూడకు చెందిన ఎం.రవీందర్ (36) నెల జీతం రాకపోవడంతో గోషామహల్ లోని కమాండెంట్ హోంగార్డు కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. శ‌రీరానికి నిప్పంటించుకోవ‌డంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై రాజాసింగ్ స్పందిస్తూ.. రాష్ట్రంలో హోంగార్డుల పని పరిస్థితులు దయనీయంగా ఉన్నాయన్నారు.

హోంగార్డులు 24×7 పోలీసు కానిస్టేబుళ్లతో కలిసి పనిచేస్తున్నారు. వారి జీవితాలు మెరుగుపడలేదు, ఉద్యోగ భద్రత లేదు. తమ సర్వీసును రెగ్యులరైజ్ చేయాలనే ఆశతో హోంగార్డులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారన్నారని అన్నారు. హోంగార్డుల పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తామని శాసనసభలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటికైనా తెలంగాణ సీఎం దృష్టి సారించి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. మరోవైపు గాయపడిన హోంగార్డు పరిస్థితి విషమంగా ఉంది. రవీందర్ కు 55 శాతం కాలిన గాయాలయ్యాయని చికిత్స పొందుతున్న ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios