హైదరాబాద్: సినీ నటుడు సుశాంత్ కు పీఆర్ మేనేజర్ గా పనిచేసిన సిద్దార్ధ్ ను ఎన్సీబీ అధికారులు శుక్రవారం నాడు హైద్రాబాద్ లో అరెస్ట్ చేశారు. సుశాంత్ రాజ్ సింగ్ తో పాటు ఆయన ఫ్లాట్ లో ఉన్న  సిద్దార్ద్ పితానీని ఎన్సీబీ   అధికారులు అరెస్ట్ చేశారు. గత ఏడాది జూన్ మాసంలో  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకొన్నాడు.  సిద్దార్ధ్ ను గతంలో కూడ ఎన్సీబీ అధికారులు పలుమార్లు విచారించారు. సుశాంత్ రాజ్‌పుత్ మరణించి ఏడాది కావడానికి కొన్ని రోజుల ముందే   సిద్దార్ధ్ ను అరెస్ట్ చేశారు.

 

సిద్దార్థ్ ను సీబీఐ, నార్కో కంట్రోల్ బ్యూరో అధికారులు  గత ఏడాది సెప్టెంబర్ మాసంలో విచారించారు. ఇదే మాసంలో సీబీఐ పలు రోజుల పాటు ఆయనను విచారించిన విషయం తెలిసిందే.గత ఏడాది జూన్ 14వ తేదీన తన ఫ్లాట్ లోనే రాజ్‌పుత్  మృతదేహాన్ని పనిమనిషి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దివంగత సుశాంత్ రాజ్‌పుత్ స్నేహితుడే సిద్దార్ధ్. బాంద్రా అపార్ట్‌మెంట్ లో సుశాంత్ తో పాటు ఆయన కూడ కలిసి ఉండేవాడు. మూడేళ్ల పాటు సుశాంత్ పాటే ఆయన ప్లాట్‌లోనే సిద్దార్ధ్ ఉన్నాడు. సుశాంత్ ఆయన పీఆర్ మేనేజర్ గా పనిచేశాడు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో ఆ కుటుంబం తరపున వాదిస్తున్న వికాస్ సింగ్ అనే న్యాయవాది సిద్దార్ధ్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని గతంలోనే పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సుశాంత్ చివరిసారిగా సిద్దార్ధ్ తో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు.