Asianet News TeluguAsianet News Telugu

మ‌హిళ హ‌త్య: నిందితుడిని ప‌ట్టించిన పచ్చబొట్టు.. ఆర్టీసీ డ్రైవర్ అరెస్ట్

Suryapet: కాలిపోయిన మృతదేహం నవంబర్ 19, 2022 న చివ్వెంలలోని దురాజ్‌పల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వెనుక పొదల్లో కనిపించింది. ఈ కేసులో మృతురాలి శ‌రీరంపై ఉన్న ప‌చ్చ‌బొట్టు నిందితుడిని ప‌ట్టించింది. కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుడైన ఆర్టీసీ డ్రైవ‌ర్ ను అరెస్టు చేశారు. 
 

Suryapet : Telangana police crack woman murder case; RTC driver arrested
Author
First Published Jan 31, 2023, 10:38 AM IST

Chivvemla mandal murder case: రెండు నెల‌ల క్రితం స‌గం కాలిపోయిన ఒక మ‌హిళ మృత‌దేహం క‌నిపించ‌డం సూర్య‌పేట‌లో సంచ‌ల‌నంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు తాజాగా ఈ కేసును చేధించారు. మృతురాలి శ‌రీరంపై ఉన్న ప‌చ్చ‌బొట్టు నిందితుడిని ప‌ట్టించింది. కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుడైన ఆర్టీసీ డ్రైవ‌ర్ ను అరెస్టు చేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. చివ్వెంల మండలంలో పాక్షికంగా కాలిపోయిన మహిళ మృతదేహం లభ్యమైన రెండు నెలల తర్వాత సూర్యాపేట పోలీసులు తెలంగాణ ఆర్టీసీ కాంట్రాక్ట్ డ్రైవర్‌ను అరెస్టు చేయడం ద్వారా హత్య మిస్టరీని ఛేదించారు. నిందితుడు కే.సైదులు.. మ‌హిళ‌ను హత్య చేసి, మృతదేహాన్ని తగులబెట్టడం ద్వారా పోలీసుల వలను తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ, ఈ కేసును ఛేదించడంలో దర్యాప్తు అధికారులకు మహిళ ముంజేయిపై పచ్చబొట్టు గుర్తు ఉపయోగపడింది. ఆ మహిళను 60 ఏళ్ల కూలి ఎస్.జయమ్మగా గుర్తించారు. ఆమె తన భర్తను విడిచిపెట్టి పిల్లలతో కలిసి సూర్యాపేటలో నివసిస్తున్న తర్వాత సైదులుతో ప‌రిచ‌యం కాస్తా సన్నిహితంగా మారింది. 

ఆమె కాలిపోయిన మృతదేహం నవంబర్ 19, 2022న చివ్వెంలలోని దురాజ్‌పల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వెనుక పొదల్లో కనిపించింది. హత్య చేయడానికి కొన్ని వారాల ముందు సైదులు జయమ్మ వద్ద డబ్బులు తిరిగి ఇప్పిస్తానని చెప్పి రూ.90 వేలు అప్పుగా తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే, ఇచ్చిన డ‌బ్బు మొత్తాన్ని తిరిగి ఇవ్వడంలో సైదులు ఆల‌స్యం చేస్తుండ‌టంతో.. జయమ్మ అతనిని ప‌దేప‌దే డ‌బ్బు గురించి అడుగుతుండ‌టంతో ఆమెను చంపేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఈ క్ర‌మంలో తాను అనుకున్న కుట్ర ప్రకారం డబ్బులు తిరిగి ఇప్పిస్తానని చెప్పి సైదులు ఆమెను దురాజ్‌పల్లికి తీసుకెళ్లాడు.

మద్యం సేవించి జయమ్మ డబ్బులు అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. సైదులు ఆమెపై దాడి చేసి చీరతో గొంతు నులిపి చంపాడు. అనంతరం మృతదేహంపై పెట్రోల్‌ పోసి తగులబెట్టి అక్కడి నుంచి పరారయ్యాడని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లోని వివిధ కార్మిక అడ్డాలు, రవాణా కేంద్రాలను సందర్శించి ఆధారాలు సేకరించినట్లు ఎస్పీ తెలిపారు. మహిళను, నిందితులను గుర్తించేందుకు వారు నేరస్థలంలోని సెల్‌ఫోన్ డేటాను, సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని కూడా విశ్లేషించారు.

పాక్షికంగా కాలిపోయిన మృతదేహానికి సంబంధించిన ఫోటోలను పోలీసులు వాట్సాప్ గ్రూపుల్లో పంచుకోవ‌డంతో పాటు వ్యక్తుల నుండి సమాచారం కోరుతూ పోస్టర్లను కూడా అతికించారు. మూడు రోజుల క్రితం పోలీసులు సర్క్యులేట్ చేసిన ఫొటోను చూసిన జయమ్మ కొడుకు.. ఆమె తన తల్లి కావచ్చునని వారి వద్దకు వెళ్లాడు. మహిళ ముంజేయిపై పచ్చబొట్టు ఉందనీ, కుటుంబ సభ్యులు ఆ టాటూను గుర్తించి జయమ్మగా గుర్తించగలిగామని ఎస్పీ తెలిపారు.  ‘‘ఇటీవల తమ గ్రామంలో బంధువు మృతి వేడుకకు జయమ్మ హాజరు కాకపోవడంతో అనుమానం వచ్చిన కొడుకు ఆమెకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా.. జయమ్మ ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో ఆమె గదికి వెళ్లి చూడగా తాళం వేసి ఉండడంతో కుటుంబసభ్యులు పరిశీలించారు. మేము ప్రసారం చేసిన ఫోటోలు-ఆ మహిళ పచ్చబొట్టు, బట్టలు, పాదరక్షలు మ‌హిళ‌ను, నిందితుడిని గుర్తించ‌డంలో ఉప‌యోగ‌ప‌డ్డాయి" అని చివ్వెంల పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios