సూర్యాపేట: సూర్యాపేట జిల్లా నూతన్ కల్ మండలం దిర్శనపల్లి క్రాస్ రోడ్డు వద్ద కిడ్నాప్‌కు గురైన కీర్తనను ముగ్గురు శనివారం నాడు కిడ్నాప్ చేశారు. ఆదివారం నాడు నిందితుల నుండి పోలీసులు  కీర్తనను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు.

సూర్యాపేట జిల్లాలోని నూతన్‌కల్ మండలంలోని దిర్శనపల్లిలో బాబాయి  ఇంటి వద్ద కీర్తన శనివారం నాడు ఆడుకొంటుంది. అయితే కీర్తనకు  బిస్కెట్ ఆశచూపిన ముగ్గురు వ్యక్తులు  ఆ పాపను కిడ్నాప్ చేశారు.

కీర్తన కిడ్నాపైన విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు. పోలీసులు కిడ్నాపర్లను ఆదివారం నాడు ఉదయం ఎల్బీనగర్ సమీపంలో అరెస్ట్ చేశారు.

నిందితుల నుండి  కీర్తనను కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ఈ ముగ్గురు కీర్తనను ఎందుకు కిడ్నాప్ చేశారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి వారికి ఇంజెక్షన్ల ద్వారా శరీరంలో  తర్వలో మార్పులు వచ్చేలా  చేసే ముఠాగా కూడ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కీర్తనను  24 గంటల్లోపుగా పోలీసులు రక్షించడంతో  తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.