Asianet News TeluguAsianet News Telugu

తాజా సర్వే: లోకసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్

తెలంగాణలో టీఆర్ఎస్ కు 42.4 శాతం ఓట్లు పడుతాయని సర్వే అంచనా వేసింది. యుపిఎకు 29 శాతం, ఎన్డీఎకు 12.7 శాతం, మజ్లీస్ కు 7.7 శాతం ఓట్లు పోలవుతాయని తేల్చింది.

Survey: TRS will sweep in Loksabha election
Author
Hyderabad, First Published Jan 25, 2019, 6:29 AM IST

న్యూఢిల్లీ: తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి తిరుగు ఉండదని రిపబ్లిక్ టీవీ సీ ఓటర్ తాజా సర్వే తేల్చిచెప్పింది. ఇప్పటికిప్పుడు లోక్‌సభకు ఎన్నికలు జరిగితే తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో 16 చోట్ల టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేస్తుందని వెల్లడించింది. 

మజ్లీస్ ఒక స్థానంలో తన పట్టును నిలబెట్టుకుంటుందని తేల్చింది. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు ఖాతా తెరిచే పరిస్థితి కూడా లేదని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ కు 42.4 శాతం ఓట్లు పడుతాయని సర్వే అంచనా వేసింది. యుపిఎకు 29 శాతం, ఎన్డీఎకు 12.7 శాతం, మజ్లీస్ కు 7.7 శాతం ఓట్లు పోలవుతాయని తేల్చింది.

జాతీయస్థాయిలో ఎన్డీఏకు ఎదురుగాలి వీస్తోందని, ఆ కూటమి సాధారణ మెజార్టీ సాధించడం కష్టమేనని సర్వేలో తేలింది. యూపీఏ గానీ ఎన్డీయే గానీ మెజార్టీ సాధించలేని పక్షంలో ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటును నిర్దేశించనున్నాయని సర్వే స్పష్టంచేసింది.

గత ఎన్నికల్లో ఎన్డీయే 336 స్థానాల్లో ఘన విజయం సాధించగా, వచ్చే ఎన్నికల్లో 233 స్థానాల్లో మాత్రమే గెలుస్తుందని తెలిపింది. యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమి (మహా ఘట్‌బంధన్), తెలంగాణలో టీఆర్‌ఎస్, ఏపీలో వైసీపీ, పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రె స్, తమిళనాడులో డీఎంకే అత్యధిక స్థానాల్లో గెలుస్తాయని సర్వేలో తేలింది. 

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 233 స్థానాలు, యూపీఏకి 167 స్థానాలు లభిస్తాయని, ఇతర ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు 143 చోట్ల గెలుస్తారని సర్వే అంచనా వేసింది.  లోక్‌సభలో సాధారణ మెజార్టీకి 272 సీట్లు అవసరం కాగా, అధికారానికి ఎన్డీయే 39 సీట్ల దూరంలో ఉంటుందని, యూపీఏ కూడా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేసే పరిస్థితి ఉండదని తేల్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios