హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నాయని తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు చెప్పారు.సోమవారం నాడు పార్టీ నేతలతో  సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.  పార్టీలో అంతర్గత విభేదాలు పక్కన పెట్టి పార్టీ అభ్యర్ధి నోముల భగత్ గెలుపు కోసం పనిచేయాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు.

also read:నాగార్జునసాగర్ బైపోల్: ఇంకా అభ్యర్ధిని ఫైనల్ చేయని బీజేపీ

చిన్నపరెడ్డికి ఎమ్మెల్సీ  రెన్యువల్ చేయనున్నట్టుగా ఆయన చెప్పారు. కోటిరెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వనున్నట్టుగా ఆయన హామీ ఇచ్చారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో తాను కూడ పాల్గొంటానని ఆయన పార్టీ నేతలకు హామీ ఇచ్చారు. తనతో పాటు కేటీఆర్ కూడ ప్రచారం నిర్వహిస్తారని చెప్పారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలోనే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో  విజయం కోసం కష్టపడి పనిచేయాలని ఆయన పార్టీ నేతలను  సూచించారు.ఈ స్థానం నుండి స్థానిక యాదవ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధిని బరిలోకి దింపాలని తొలుత టీఆర్ఎస్ నాయకత్వం భావించినట్టుగా ప్రచారం సాగింది. అయితే చివరకు నోముల నర్సింహ్మయ్య కుటుంబం వైపే కేసీఆర్ మొగ్గు చూపారు. 

నాగార్జునసాగర్ ఉప ఎన్నికను టీఆర్ఎస్ నాయకత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. ఈ స్థానం నుండి జానారెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో దిగారు.

ఈ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్ధిని బీజేపీ ఇంకా ప్రకటించాల్సి ఉంది.