ఎమ్మెల్యేల  ప్రలోభాల  కేసులో  సీబీఐ   విచారణను  తెలంగాణ ప్రభుత్వం  సుప్రీంకోర్టులో  సవాల్  చేసింది.   ఈ నెల  17వ తేదీన ఈ పిటిషన్ పై  విచారణ నిర్వహించనుంది  సుప్రీంకోర్టు. 

హైదరాబాద్: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో సీబీఐ విచారణను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఈ నెల 17వ తేదీన విచారణ చేయనున్నట్టుగా సుప్రీంకోర్టు తెలిపింది. 

సీజేఐ ధర్మాసనం ముందు ఈ పిటిషన్ ను తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది సిద్దార్థ లూత్రా ఇవాళ మెన్షన్ చేశారు. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై స్టేటస్ కో ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో మెరిట్స్ ఉంటే తెలంగాణ హైకోర్టు ఆదేశాలను రివర్స్ చేస్తామని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది.

ఈ నెల 13వ తేదీన ఈ పిటిషన్ పై విచారణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్దార్ధ లూత్రా సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరారు. అయితే ఈ నెల 17న విచారణ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. 

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సీబీఐ విచారణకు తెలంగాణ సింగిల్ బెంచ్ 2022 డిసెంబర్ 16వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై 2023 జనవరి 4వ తేదీన తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. ఈ విషయమై ఈ నెల 6వ తేదీన తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఆదేశాలను హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్ధించింది. సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను సుప్రీంకోర్టులో నిన్న సుప్రీంకోర్టు సవాల్ చేసింది.

ఈ కేసుకు సంబంధించి న ఆధారాలను ఇవ్వాలని సీబీఐ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో స్టేటస్ కో ను అడిగింది. స్టేటస్ కో ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో మెరిట్స్ ఉంటే హైకోర్టు తీర్పును రివర్స్ చేస్తామని కూడ సుప్రీంకోర్టు తెలిపింది. 

2022 అక్టోబర్ 26వ తేదీన మొయినాబాద్ ఫాం హౌస్ లో నలుగురు ఎమ్మెల్యేలను ముగ్గురు వ్యక్తులు ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నించారని కేసు నమోదైంది. ఈ ఎమ్మెల్యేల ప్రలోభాల వెనుక బీజేపీ హస్తం ఉందని బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను బీజేపీ కొట్టి పారేసింది.

also read:ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో కేసీఆర్‌ సర్కార్ కు షాక్: డివిజన్ బెంచ్ ఆదేశాలపై విచారణకు హైకోర్టు నిరాకరణ

అచ్చంపేట , కొల్లాపూర్, పినపాక, తాండూరు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డిలను ప్రలోభాలకు గురి చేశారని ేకసు నమోదైంది. రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు.