న్యూఢిల్లీ: ఓటుకు నోటుకు కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జస్టిస్ వీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంతలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ చేసింది. ఓటుకు నోటు కేసు విచారణ పూర్తయ్యేవరకు సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఏసీబీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ విషమయై నాలుగు వారాల్లో  సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

also read:ఓటుకు నోటు కేసు: సుప్రీంకోర్టుకు ఎక్కిన రేవంత్ రెడ్డి, చంద్రబాబుకు ఊరట

also read:ఓటుకు నోటు కేసులో రేవంత్ కి షాక్:చార్జీషీట్ దాఖలు చేసిన ఈడీ

 

ఏసీబీ చార్జీషీట్ ఆధారంగా  ఈడీ రేవంత్ రెడ్డిపై చార్జీషీట్ దాఖలు చేసింది. ఈడీ చార్జీషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసులో సాక్షులందరి చీప్ ఎగ్జామినేషన్ పూర్తైన తర్వాతే క్రాస్ ఎగ్జామినేషన్ చేపట్టాలని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.  ఈ వినతిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. రేవంత్ రెడ్డి  దాఖలు చేసిన పిటిషన్ కు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.