న్యూఢిల్లీ: టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంలో ఈడీ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

గతంలో కూడా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని ఈడీ కోరింది. అందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 

బెయిల్ షరతులను రవిప్రకాష్ ఏమైనా ఉల్లంఘిచారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.అన్నీ పరిశీలించిన తర్వాతే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.ఈడీ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

2018 సెప్టెంబర్ నుండి 2019 మే వరకు రవిప్రకాష్ సహా మరో ఇద్దరు టీవీ 9 మాతృసంస్థ అసోసియేటేడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ నుండి రూ. 18 కోట్లను ఉపసంహరించినట్టుగా ఆ సంస్థ ప్రతినిధులు బంజరాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.