Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు విముఖత.. రామచంద్రభారతి పిటిషన్‌ కొట్టివేత..

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు విముఖత చూపెట్టింది. 

Supreme court On Ramachandra Bharathi Petition in TRS MLAS Poaching Case
Author
First Published Nov 21, 2022, 12:57 PM IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు విముఖత చూపెట్టింది. నిందితుల్లో ఒకరైన రామచంద్రభారతి రిమాండ్‌ను సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే రామచంద్రభారతి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. కేసు విచారణ దశలో జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే పిటిషనర్‌కు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించే హక్కు ఉందని తెలిపింది.  

తెలంగాణలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన  సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ కేసును హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారిస్తోంది. ఈ కేసులో రామచంద్రభారతి, నందకుమార్‌, సింహయాజీలు నిందితులుగా ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios