Asianet News TeluguAsianet News Telugu

ఉదాసీన్ మఠానికి ఊరట.. కూకట్‌పల్లిలోని 540 ఎకరాల భూమిపై సుప్రీం కీలక తీర్పు

హైదరాబాద్ కూకట్‌పల్లి వై జంక్షన్ సమీపంలో వున్న 540 ఎకరాల భూమి దేవాదాయ శాఖ పరిధిలోని ఉదాసీన్ మఠానివేనని స్పష్టం చేసింది సుప్రీంకోర్ట్. 

supreme court key verdict on 540 acres of land in kukatpally
Author
First Published Sep 14, 2022, 8:47 PM IST

హైదరాబాద్ కూకట్‌పల్లి వై జంక్షన్ సమీపంలో వున్న 540 ఎకరాల భూమి హక్కులపై కీలక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్ట్. అత్యంత విలువైన ఆ భూములపై పూర్తి హక్కు దేవాదాయ శాఖ పరిధిలోని ఉదాసీన్ మఠానివేనని స్పష్టం చేసింది. ఈ కేసులో ఉదాసీన్ మఠానికి ప్రత్యర్ధిగా వున్న గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్‌ వుంది. ఈ భూములను 1964, 1965, 1969, 1978లలో గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్‌కు 99 ఏళ్ల పాటు ఉదాసీన్ మఠం లీజుకిచ్చింది. బఫర్ జోన్‌లో వున్న ఈ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించింది గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్. 

దీనిని సవాల్ చేస్తూ ఉదాసీన్ మఠం, దేవాదాయ శాఖ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన ట్రిబ్యూనల్ 2011లో గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్‌కు ఇచ్చిన లీజును రద్దు చేసింది. ట్రిబ్యూనల్ తీర్పును సవాల్ చేస్తూ గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. 2013లో ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది కోర్ట్. దీనిని సవాల్ చేస్తూ గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్ సుప్రీంకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేయగా.. 2013లో స్టేటస్ కో ఇచ్చింది ధర్మాసనం. ఈ కేసులో ఇప్పుడు తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్ట్. గల్ఫ్ ఆయిల్ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దేవుడి మాన్యం భూములపై పూర్తి హక్కు.. దేవాదాయ శాఖకే వుందని స్పష్టం చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios