హైదరాబాద్:తెలంగాణలో బాణసంచా నిషేధంపై శుక్రవారం నాడు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.బాణసంచా నిషేధంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును మారుస్తూ సుప్రీంకోర్టు ఇవాళ మధ్యాహ్నం ఉత్తర్వులు ఇచ్చింది.

also read:బాణసంచాపై తెలంగాణ సర్కార్ నిషేధం: సుప్రీంకోర్టులో క్రాకర్స్ అసోసియేషన్ పిటిషన్

 రాష్ట్రంలో బాణసంచాపై నిషేధం విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ నిషేధం విధించింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పునకు లోబడి హైకోర్టు ఆదేశాలు ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నవంబర్ 9వ తేదీన బాణసంచా వినియోగంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది.

ఈ విషయమై ప్రతివాదులకు కూడ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.దీపావళి రోజున రెండు గంటలపాటు  బాణసంచా కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఏ సమయంలో బాణసంచా కాల్చాలనే విషయాన్ని ప్రభుత్వమే నిర్ణయించాలని సుప్రీంకోర్టు తెలిపింది.