Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్ర సచివాలయ వివాదం... రేవంత్ రెడ్డి పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

రాష్ట్రంలోని పాత సచివాలయం కూల్చివేత, నూతన భవన నిర్మాణంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో గురువారం విచారణ చేపట్టింది.

supreme court inquiry on telangana secretariate issue
Author
Hyderabad, First Published Oct 15, 2020, 9:10 PM IST

న్యూడిల్లీ: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాత సచివాలయ భవనం కూల్చివేత, నూతన భవన నిర్మాణంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో గురువారం విచారణ చేపట్టింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వడంతో పాటు సచివాలయ నిర్మాణంలో యథాతథస్థితిని పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టును ఈ పిటిషన్ ద్వారా కోరాడు. అంతేకాకుండా పర్యావరణ ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకునేలా ఆదేశించాలని కోరారు. 

ఇలా రేవంత్ దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇప్పటికే సచివాలయం కూల్చివేత పూర్తయినట్లు గుర్తుచేశారు. అలాగే ఇదే అంశంపై జీవన్‌రెడ్డి పిటిషన్‌ను వేరే బెంచ్ కొట్టేసినట్లు గుర్తుచేసిన సీజేఐ... ఈ పిటిషన్ ను కూడా జస్టిస్ అశోక్ భూషణ్ బెంచ్ కి బదిలీచేశారు చీఫ్ జస్టిస్.

 read more కొత్త సచివాలయంలో మసీదు, హజ్‌హౌస్... డిజైన్‌‌ ఎంఐఏందా : కేసీఆర్‌పై రాజాసింగ్

నిజాంల కాలంనాటి పురాతన భవనంలో కొనసాగుతున్న ప్రస్తుత సచివాలయ భవనాన్ని గుప్తనిధుల కోసమే కూలుస్తున్నారంటూ ఇదివరకే ఎంపీ రేవంత్ ఆరోపించారు. అందుకోసం కాకుంటే సెక్రటేరియేట్ చుట్టూ 3 కిలోమీటర్ల మేర కఠిన నిషేధాజ్ఞలు విధించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. మంచి కార్యక్రమాలు ఎవరైనా పగలే చేస్తారని... దేశంలో ఏ అభివృద్ధి కార్యక్రమమైనా పగటి సమయంలోనే జరుగుతుందన్నారు. కానీ గుప్త నిధుల తవ్వకాలు మాత్రమే అర్థరాత్రి చేస్తారని ఆయన ఎద్దేవా చేశారు. పోఖ్రాన్ అణు పరీక్షలు కూడా ఇంత రహస్యంగా జరపలేదని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

సచివాలయం కూల్చివేత సమయంలో ఎవ్వరినీ సెల్‌ఫోన్లు తీసుకెళ్లనివ్వలేదని.. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లు సెల్‌ఫోన్‌లో వీడియోలు తీశారని వెంటనే వారిని డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ పరిణామాలను బట్టి తాము పరిశోధన చేయగా.. నిజాం నిధుల విషయం వెలుగులోకి వచ్చిందని.. దీని గురించి కేసీఆర్ పత్రికతో పాటు జాతీయ పత్రికలు సైతం గతంలో రాశాయని రేవంత్ పాత పేపర్ కటింగ్‌లను చూపించారు.

హోంసైన్స్ కాలేజీ నుంచి మింట్ కాంపౌండ్, విద్యారణ్య పాఠశాల, జీబ్లాక్, సైఫాబాద్ ప్యాలెస్‌లకు ఉన్న సొరంగాల్లో గుప్త నిధులు ఉండే అవకాశం ఉందని అధికారుల నివేదిక ఇచ్చారని కూల్చివేతల కంటే ముందు రాష్ట్రం ఈ సాంకేతిక నిపుణులతో పూర్తిగా విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఇలా సచివాలయ భవనం కూల్చివేతను వ్యతిరేకిస్తుంటే రాష్ట్ర హైకోర్టు అనుమతిండంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ రేవంత్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం తాజా నిర్ణయం తీసుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios