Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ముందస్తు పిటీషన్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ముందస్తు ఎన్నికల పిటీషన్ పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముందస్తు ఎన్నికలపై వేసిన పిటీషన్ ను విచారించిన సుప్రీం కోర్టు అన్ని పిటీషన్లను రేపే విచారణ చేపట్టాలని హైకోర్టుకు ఆదేశించింది. ఎన్నికలపై స్టే విధించాల్సి వస్తే హైకోర్టుకు అధికారం ఉంటుందని తేల్చిచెప్పింది.

Supreme Court hearing Marri Shashidhar Reddy Petition
Author
Delhi, First Published Oct 4, 2018, 3:01 PM IST

ఢిల్లీ:తెలంగాణ ముందస్తు ఎన్నికల పిటీషన్ పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముందస్తు ఎన్నికలపై వేసిన పిటీషన్ ను విచారించిన సుప్రీం కోర్టు అన్ని పిటీషన్లను రేపే విచారణ చేపట్టాలని హైకోర్టుకు ఆదేశించింది. ఎన్నికలపై స్టే విధించాల్సి వస్తే హైకోర్టుకు అధికారం ఉంటుందని తేల్చిచెప్పింది.

మరోవైపు తెలంగాణలో ఓట్ల అవకతవకలపై కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఓటర్ల జాబితాలో భోగస్ ఓటర్లు ఉన్నారని వాటిని సవరించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని పిటీషన్లో పేర్కొన్నారు మర్రి శశిధర్ రెడ్డి. 

మర్రి శశిధర్ రెడ్డి పిటీషన్ విచారణలో భాగంగా కేంద్రం ఎన్నికల సంఘానికి, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం అఫిడవిట్ రూపంలో వివరణ ఇచ్చింది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios