Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్‌కు చేరుకొన్న సీజేఐ: ఘనస్వాగతం పలికిన తెలంగాణ సర్కార్

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ హైద్రాబాద్ కు చేరుకొన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో  ఎన్వీ రమణకు  తెలంగాణ ఐటీ శాఖ మంత్రి  కేటీఆర్ సహా పలువురు మంత్రులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

Supreme court chief justice NV Ramana reaches Hyderabad lns
Author
Hyderabad, First Published Jun 11, 2021, 4:18 PM IST

హైదరాబాద్ : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ హైద్రాబాద్ కు చేరుకొన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో  ఎన్వీ రమణకు  తెలంగాణ ఐటీ శాఖ మంత్రి  కేటీఆర్ సహా పలువురు మంత్రులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమ కోహ్లీ సహా పలువురు జడ్జిలు కూడ ఎన్వీ రమణకు స్వాగతం పలికారు.శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి ఎన్వీ రమణ రాజ్‌భవన్ చేరుకొంటారు.  ఇవాళ రాత్రికి ఆయన రాజ్‌భవన్ లో బస చేయనున్నారు. 

also read:న్యాయ వ్యవస్థను అత్యున్నతస్థాయికి తీసుకెళ్లేందుకు కృషి: సీజేఐ ఎన్వీరమణ

రాజ్‌భవన్ లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు సీఎం కేసీఆర్ స్వాగతం పలకనున్నారు. సుప్రీంకోర్టు చీఫ్  జస్టిస్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా హైద్రాబాద్ వచ్చిన రమణకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున స్వాగతం ఏర్పాటు చేసింది. రమణ రాకను స్వాగతిస్తూ నగరంలోని పలు చోట్ల హైర్డింగ్స్, ఫ్లెక్సీలను  ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.ఇవాళ ఉదయం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకొన్నారు.  ఇవాళ మధ్యాహ్నం తిరుమల నుండి ఆయన హైద్రాబాద్ కు చేరుకొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios