హైదరాబాద్: ఆర్టీసీలో కొత్త ఉద్యోగుల నియామకం కోసం తీసుకోవాల్సిన చర్యలు,  ప్రైవేట్ వాహనాల విషయంో ఏ రకమైన  చర్యలు తీసుకోవాలనే విషయమై సునీల్ శర్మ కమిటీ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సోమవారం నాడు నివేదిక అందించింది.

సోమవారం నాడు ఉదయం నుండి సునీల్ శర్మ కమిటీ ఎర్రమంజిల్‌లో సమావేశమైంది. ఆర్టీసీలో తీసుకోవాల్సిన చర్యలపై  సునీల్ శర్మ కమిటీ  నివేదికను తయారు చేసింది. ఆదివారం నాడు సీఎం కేసీఆర్  ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమీక్ష సమావేశంలో ఆర్టీసీలో భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపై సీఎం కేసీఆర్  అధికారులకు సూచనలు చేశారు.

ఈ సూచనల మేరకు సునీల్ శర్మ కమిటీ  సోమవారం నాడు  పలు అంశాలపై అధ్యయనం చేసి ఓ నివేదికను తయారు చేసి సీఎం కేసీఆర్ కు ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా సీఎం కేసీఆర్  నిర్ణయం తీసుకోనున్నారు.

ఆర్టీసీలో సగం ప్రైవేట్ బస్సులు మిగిలినవి ప్రభుత్వ బస్సులను నడపాలని  సర్కార్ భావిస్తోంది.ప్రైవేట్ బస్సుల నోటిఫికేషన్ కు సంబంధించి సునీల్ శర్మ కమిటీ విధి విధానాలను రూపొందించింది.

ఈ నివేదిక ప్రకారంగా  సీఎం కేసీఆర్  నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.ఆర్టీసీలో కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారు యూనియన్లలో చేరబోమని ఎంఓయూపై సంతకం చేయాలని సీఎం  కేసీఆర్ ప్రకటించారు. ఈ  విధానంపై కూడ సునీల్ శర్మ మార్గదర్శకాలను తయారు చేసింది.