తెలంగాణ బలోపేతం దిశగా బీజేపీ కార్యచరణ సిద్దం చేసుకుంటుంది. ఇప్పటికే బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది.
తెలంగాణ బలోపేతం దిశగా బీజేపీ కార్యచరణ సిద్దం చేసుకుంటుంది. ఇప్పటికే బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పర్యటిస్తున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్గా సునీల్ బన్సల్.. పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. లీడర్ కాకుండా పార్టీ కేంద్రంగ కార్యక్రమాలు జరగాలని సూచించారు. కార్యక్రమాలు చేయనివ్వడం లేదని, కొందరు రావడం లేదని సాకులు చెప్పొద్దని అన్నారు. స్వచ్ఛందంగా వచ్చేవారితోనే శక్తి కేంద్రాల సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. ఈ నెల 24న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహణకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. అలాగే ఈ నెల 27న జిల్లా, 28, 29 తేదీల్లో మండల కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది. ఇక, ఫిబ్రవరిలో శక్తి కేంద్రాల సమావేశాలకు ప్రణాళికలు రచిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ రోజు సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల కన్వీనర్, సహ కన్వీనర్, ప్రభారీ, విస్తారక్‌లతో సునీల్ బన్సల్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. గురువారం ఉదయం పటాన్‌చెరులో జరగనున్న మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం, అలాగే మధ్యాహ్నం జరగనున్న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశాలకు సునీల్ బన్సల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
