నా భార్య మీద యాక్షన్ తీసుకోవాలి

First Published 23, Jan 2018, 5:51 PM IST
suneetha Reddy husband wants action against infidel wife
Highlights
  • డిజిపి మహేందర్ రెడ్డిని కలిసిన సునీతారెడ్డి భర్త
  • తన భార్యమీద, సిఐ మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్
  • తనకు ప్రాణహాని ఉందని డిజిపికి వినతి

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పోలీసు పెద్దల అక్రమ సంబంధం కీలక మలుపులు తిరుగుతున్నది. తనను పెళ్లి చేసుకుని తన కింద పనిచేసే సిఐతో అక్రమ సంబంధం నడుపుతున్న తీరుపై ఆమె భర్త రగిలిపోయాడు. ఎలాగైనా బండారం బయట పెట్టేందుకు స్కెచ్ వేసి గుట్టు రట్టు చేశాడు. ఇప్పుడు ఈ విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గే పరిస్థితి కనిపించడంలేదు. తనను మోసం చేసిన భార్యపై చర్యలు తీసుకునే వరకు ఎఎస్పీ సునీతారెడ్డి భర్త ఆమెను వదిలేలా లేడు.

తాజాగా డిజిపి మహేందర్ రెడ్డిని కలిశారు ఎఎస్సీ సునీతారెడ్డి భర్త సురేందర్ రెడ్డి. తనను మోసం చేసి అక్రమ సంబంధం నడుపుతున్న తన భార్యతోపాటు సిఐ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై సిఐ మ్లలిఖార్జునరెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

సునీతారెడ్డి వ్యవహారం ఇటు పోలీసు బాసులకు అటు.. ప్రభుత్వ పెద్దలకు కొత్త తలనొప్పులు తెస్తోంది. ఈ విషయాన్ని ఎలా ముగించాలో తెలియక పోలీసు పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఇంకోవైపు ఆమె మా విభాగంలో వద్దు.. వెనక్కు తీసుకోవాలంటూ ఎసిబి ఉన్నతాధికారులు వత్తిడి మొదలు పెట్టారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే సిఐ మల్లిఖార్జునరెడ్డి మీద వేటు పడింది. కానీ.. అడిషనల్ ఎస్పీ మీద కూడా చర్యలు తీసుకునే వరకు ఆమె భర్తగా ఉన్న సురేందర్ రెడ్డి వదిలేలా కనిపించడంలేదు. దీంతో పోలీసు పెద్దలకు ప్రభుత్వ పెద్దలకు ఆందోళన మొదలైంది.

సునీతారెడ్డి భర్త సురేందర్ రెడ్డి తన భార్య, సిఐ మల్లిఖార్జునరెడ్డి బండారం మొత్తం రాతపూర్వకంగా వివరిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన ఫిర్యాదు కాపీ ఫొటోలు కింద ఉన్నాయి చూడొచ్చు.

loader