కేంద్ర ఎన్నికల సంఘానికి కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని ఫిర్యాదు చేశారు. తన ప్రత్యర్థి, టీఆర్ఎస్ పార్టీ కూకట్ పల్లి అభ్యర్థి మాధవరం కృష్ణారావుకి పోలీసులు సహకరిస్తున్నారంటూ ఆమె ఫిర్యాదు చేశారు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు, కూకట్ పల్లి ఏసీపీ సురేంద్ర లు టీఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు.

ఆ ఇద్దరు అధికారులను బదిలీ చేయాల్సిందిగా సుహాసిని ఎన్నకిల అధికారులను కోరారు. తమ కుటుంబానికి చెందిన మహిళలను టీఆర్ఎస్ కార్యకర్తలు బెదిరిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని అల్లాపూర్, ఓల్డ్ బోయినపల్లి ప్రాంతాల్లో అదనపు బలగాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. 

మరిన్ని వార్తలు ఇక్కడ చదవండి

సుహాసిని తరపున..ఎన్టీఆర్ ప్రచారానికి రాకపోవడానికి కారణం ఇదే..

నందమూరి సుహాసిని కోసం ఓట్ల కొనుగోలు: ముగ్గురి అరెస్టు

జోరుగా బెట్టింగ్: సుహాసిని కూకట్ పల్లి సీటు హాట్ కేక్