ప్రాంతీయ భావజాలంతో ప్రత్యేక రాష్ట్రం గా మారిన తెలంగాణాలో ఉప ప్రాంతీయ పోరాటాలు మొదలవుతున్నాయి. పాలమూరు నీళ్లను కొల్లగొట్టి నల్లగొండ జిల్లాకు తరలిస్తున్నారని ఉద్యమం మొదలయింది.
వారం రోజుల కిందట కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ వంశీ చంద్ రెడ్డి కల్వకుర్తి లిఫ్ట్ నీళ్లను నల్లగొండకు తరలిస్తున్నారని, వాళ్ల కోటా తగ్గించారని పాదయాత్ర చేశారు. యాత్రకి విశేష స్పందన వచ్చింది. ఇంతకంటే ముఖ్యమయిందేమిటంటే, వంశీ చేసిన ఆరోపణ. దక్షిణతెలంగా జిల్లాలో విబేధాలు సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ వ్యవహారం జాగ్రత్త గా పరిష్కరించకపోతే, ఉప ప్రాంతీయ పోారాటాలకు బాటవేస్తుందనేందుకు ఈ రోజు టిజాక్ కల్వకుర్తి ఛెయిర్మన్ అయిల సదానందం గౌడ్, బిఎస్ పి రాష్ట్ర కార్యదర్శి కానుగుల జంగయ్య విడుదల చేసిన ప్రకటన సాక్ష్యం.ఈ ప్రకటన రగులుతున్న ఉప ప్రాంతీయ (సబ్ రీజనల్ ) ఆగ్ర హాన్ని వ్యక్తీకరించింది. అందుకే ఈ ప్రకటనను యథాతథంగా ఇస్తున్నారు.
డిండి చెరువు లో దొంగలు పడ్డారు.
1) కల్వకుర్తి రైతుల దుఃఖాన్ని తీర్చాల్సిన కేఎల్ఐ నీళ్లను పట్టపగలు ప్రజలు చుస్తుండగానే మనకండ్ల ముందే
ఆంధ్రోల్ల మాదిరిగా నల్లగోండకు చెందిన అధికార పార్టీ దొంగలు నీళ్ల దోపిడిచేస్తుంటే కల్వకుర్తి చెఃదిన ఆధికార పార్టీ సభ్యులు మౌనంగా ఉండటం మన ప్రాంత రైతాంగానికి
మనమే ద్రోహం చేసినట్లు అవుతుంది .
2) గత 3 దశాబ్దాల కాలం నండి కల్వకుర్తి తాలుకా రైతాంగం బువ్వకు,దూపకు ఏడుస్తుంది. నెర్రలు బారిన బీడు భూముల్ని చూసిన రైతాంగం గుండెలు బాదుకుంటుంది. బతుకు చిత్రంలో ఉన్న ఊరును, కన్నవారిని వదలలేక,బతుకుదెరువులేక దుఃఖాన్ని దిగమింగుకోని వలస బాట పట్టే కాలం వచ్చింది.
3) నల్లగొండ జిల్లా అధికార పార్టీ ద్రోహపూరిత చర్యలు ఒకవైపు నాగర్ కర్నూల్ జిల్లా అధికార పార్టీ సభ్యుల మౌనం ముఖ్యంగా కవ్వకుర్తి మౌనంతో (పొన్నాల లక్ష్మయ్య,డికే అరుణ ల) కల్వకుర్తి తాలూకా రైతాంగం జీవితాల్లో కారు చీకట్లు కమ్ముకుంటున్నాయి.
4) "రామేశ్వరం పోయిన శనేశ్వరుడు వదల్లేదు"అన్నట్లు ఆంధ్రొల్లు పోయిన గానీ కల్వకుర్తి రైతుల కష్టాలుతీరట్లేదు. కల్వకుర్తి రైతాంగం నోట్లో మట్టికొట్టె విధానం ఎండగడుదాం
5) రాజకీయ నాయకుల్లారా! ప్రజాస్వామిక వాదుల్లారా!!
విద్యార్తీ,యువకుల్లారా!!!
న్యాయ వాదుల్లారా!!!!
జర్నలిస్టుల్లారా!!!!!
ఒక్క సారీ... ఆలోచించండి. మతి భ్రమించి మాట్లాడుతున్న
మంత్రుల తిట్లపురాణాలు అవగాహన సదస్సులు అధికారపార్టీల జల పూజలు
ఐక్యతలేని రైతు యాత్రలు ఐక్యతలేని రాజకీయ ఉద్యమాలు కల్వకుర్తి రైతాంగానికే నష్టం.
6-175 రోజుల రిలే నిరాహార దీక్షలు తెలంగాణ రాష్ట్రంకై చేశాము. 53 రోజుల RDO దీక్షలు చేశాము.
7 రోజుల ఆచారన్న ఆమరణదీక్ష 6 రోజుల రాఘవేంధర్ ఆమరణదీక్ష 3రోజుల వంశీ అన్న ఆమరణదీక్ష
3 రోజుల విజయ్ ఆమరణదీక్ష 1 రోజు కిష్టారెడ్డి మౌన దీక్ష లతో
జేఏసి ఉధ్యమ జన చైతన్యం తో బలమైనఉద్యమాలు చేసి విజయం సాధించిన చరిత్ర
మన కల్వకుర్తి ప్రజలకుంది.
7) మరీ....రైతులకోసం ఎందుకు ఐక్యంగా ఉద్యమించడంలేదు? నల్లగొండ రాజకీయ నాయకులు రైతుల కోసం ఏకం అవుతున్నారు . పాలమూరు రాజకీయ నాయకులు
ఎందుకు ఏకం అవ్వడంలేదు? మతలబ్ ఏమిటి ? మన రైతులపై ప్రేమలేదా? లేక నల్లగొండ రైతులపై ప్రేమనా?లేదా నల్లగొండ రాజకీయానికీ
బానిసలా బందీ అవుతున్నారా? ఎవ్వరు ఏకం ఐనా కాకపోయినా
కల్వకుర్తి రాజకీయ నాయకులు ఐక్యం కావాల్సిన సందర్భం యిది.
ఐక్య ఉద్యమాలకు సిద్దం కావాలి ఐక్యత విజయానికి చిహ్నం
లేకుంటే.......మనందరం బావి తరాల కల్వకుర్తి తాలుకాకు
కేఎల్ఐ నీళ్ల విషయంలో మోసం చేసిన వాళ్ళం అవుతాం.
---- అయిల సదానందంగౌడు
టిజేఏసి ఛైర్మేన్,కల్వకుర్తి
9705125784
కానుగుల జంగయ్య
బిఎస్పి రాష్ట్ర కార్యదర్శి
9603263152.
