Asianet News TeluguAsianet News Telugu

కరోనా వ్యాప్తి: తెలంగాణకు పొంచి ఉన్న భారీ ముప్పు

తెలంగాణలోని జిల్లాల్లో కరోనా వైరస్ పెద్ద యెత్తున వ్యాప్తి జరిగే ప్రమాదం ఉందని లాన్సెట్ అనే అంతర్జాతీయ మ్యాగజైన్ లో అచ్చయిన ఓ అధ్యయన నివేదిక తెలియజేస్తోంది. 

Study on coronavirus spread: Telangana is in dangerous position
Author
New Delhi, First Published Jul 18, 2020, 7:48 AM IST

న్యూఢిల్లీ: తెలంగాణ జిల్లాల్లో కరోనా మహమ్మారి విజృంభించే అవకాశం ఉందని ప్రముఖ అంతర్జాతీయ మెడికల్ జనరల్ లాన్సెట్ హెచ్చరించింది. ప్రస్తుతం కరోనా వైరస్ కేసులో పెద్ద యెత్తున లేకపోయినప్పటికీ వచ్చే కాలంలో జిల్లాల్లో కోవిడ్ -19 ముంచుకొచ్చే ప్రమాదం ఉందని, అందుకు సంకేతాలు ఉన్నాయని పాపులేషన్ కౌన్సిల్ భారత విభాగం శాస్త్రవేత్తలు రూపొందించిన ఓ అధ్యయన నివేదికను లాన్సెట్ ప్రచురించింది. 

సామాజిక ఆర్థిక స్థితిగతులు, జనాభా, ఇళ్లు - పరిసరాల పరిశుభ్రత, ఇన్ఫెక్షన్ల నియంత్రణ చర్యలు, ఆరోగ్య వ్యవస్థల అప్రమత్తత అనే ఐదు విభాగాల్లోనిి 15 సూచికల ప్రాతిపదికగా అన్ని రాష్ట్రాల్లోని జిల్లాలకు పొంచి ఉన్న కరోనా ముప్పును అంచనా వేసినట్లు పాపులేషన్ కౌన్సిల్ శాస్త్రవేత్త రాజీవ్ ఆచార్య తెలిపారు. 

ఆ లెక్కల ప్రకారం.... దేశంలోని 30 పెద్ద రాష్ట్రాల్లోని 9 రాష్ట్రాలు రానున్న రోజుల్లో తీవ్రమైన ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి ముప్పు పొంచి ఉన్న రాష్ట్రాలకు సున్నా నుంచి ఒకటి వరకు స్కేలింగ్ ఇచ్చారు. ఆ జాబితాలో సున్నా స్కేలింగ్ లో మధ్యప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉండగా, 0.75 స్కేలింగ్ తో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. 

రెండో స్థానంలో బీహార్ నిలిచింది. నాలుగు నుంచి తొమ్మిది వరకు స్థానాల్లో వరుసగా జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, గుజారత్ ఉన్నాయి. కరోనా వైరస్ ముప్పు తీవ్రత అతి ఎక్కువగా ఉ్న జిల్లాలు సిక్కిం, అరుణాచల్ ప్రదశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నాయి. 

కోవిడ్ -19 ముప్పు ఉన్న దేశంలోని 100 జిల్లాల్లో యూపీలో 33, బీహార్ లో 24, మధ్యప్రదేశ్ లో 20 ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో జనాభాకు అనుగుణంగా పరీక్షలు చేసి కేసులను గుర్తించడం లేదని, ఫలితంగా కేసులన్నీ బయటపడి వైద్య సదుపాయాలు అందక మరణాలు సంభవించవచ్చునని రాజీవ్ ఆచార్య అన్నారు. ఈ అధ్యయనం కోసం తీసుకున్న జిల్లాల సామాజిక, ఆర్థిక స్థితిగతుల గణాంకాలు రెండు నుంచి ఐదేళ్ల కిందటవని, ఈలోగా ఆయా జిల్లాల్లో పరిస్థితులు మారి ఉఇంటే తమ నివేదికలో ప్రస్తావించిన తీవ్రతల్లో హెచ్చుతగ్గులుంటాయని చెప్పారు. 

ఇదిలావుంటే, పాపులేషన్ కౌన్సిల్ అనేది అమెరికాకు చెందిన జాన్. డి. రాక్ ఫెల్లర్ -3 స్థాపించిన అధ్యయన సంస్థ.

Follow Us:
Download App:
  • android
  • ios