హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో  తీవ్ర ఉద్రిక్తత  చోటుచేసుకుంది. హెచ్ సీయూ భూములను మై హోం కబ్జా చేస్తున్నారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు గచ్చిబౌలిలో ఆందోళన చేయడం మొదలుపెట్టారు.

గచ్చిబౌలి నుండి గొపన్పల్లికి అధికారులు ప్రత్యేక రోడ్డును వేస్తున్నారు. అయితే ఆ భూమి సెంట్రల్ యూనివర్సిటీకి చెందినదని విద్యార్థులు చెబుతున్నారు. నిన్నటి నుండి రోడ్డు పనులను అధికారులు మొదలు పెట్టడటంతో వాటిని అడ్డుకునేందుకు విద్యార్థులు యత్నించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను చెదరగొట్టి అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.   కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.