హైదరాబాద్ శివారు ఘట్‌కేస్‌లోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. శ్రీనిధి యూనివర్సిటీ పేరుతో ఇచ్చిన అడ్మిషన్లను శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్‌కు బదిలీ చేస్తామని మాట తప్పారని విద్యార్థులు ఆందోళనకు దిగారు.
హైదరాబాద్ శివారు ఘట్‌కేస్‌లోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. శ్రీనిధి యూనివర్సిటీ పేరుతో ఇచ్చిన అడ్మిషన్లను శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్‌కు బదిలీ చేస్తామని మాట తప్పారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే కాలేజ్‌ను ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేశారు. అయితే తమకు న్యాయం చేయాలంటూ ఓ విద్యార్థి కాలేజ్ బిల్డింగ్ పైకి ఎక్కి దూకేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో కాలేజ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాను చనిపోతే తోటివారికైనా న్యాయం జరుగుతుందంటూ ఆ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మిగిలిన విద్యార్థులు ఎలాగోలా అతడిని కిందకు దించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.పోలీసులు కూడా అక్కడకు చేరుకున్నారు. అయితే గతకొద్ది రోజులుగా శ్రీనిధి కాలేజ్‌లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
అసలేం జరిగిందంటే.. గురునానక్, శ్రీనిధి వర్సిటీలను ఏర్పాటు చేస్తూ 2022 సెప్టెంబర్‌లో అ సెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం లభించింది. అయితే ఈ బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడంతో వర్సిటీలు ఏర్పాటు కాలే దు. మరోవైపు అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందగానే ఈ వర్సిటీలు విద్యార్థుల నుంచి అడ్మిషన్లు తీసుకున్నాయి. అయితే శ్రీనిధికి యూనివర్సిటీ గుర్తింపు లేకపోయినా.. త్వరలో వస్తుందంటూ నమ్మించి, భారీగా ఫీజులు వసులు చేసి విద్యర్థులకు తీరని అన్యాయం చేశారని విద్యార్థులు ఆరోపించారు. యూనివర్సిటీ గుర్తింపు లేకుండానే ఉందని చెప్పి ఫీజులు దండుకొన్నారని మండిపడ్డారు. శ్రీనిధి కాలేజ్‌లో నిరసన కొనసాగించారు. కాలేజ్ అద్దాలు, ఫర్నీచర్ కూడా ధ్వంసం చేశారు.
ఈ క్రమంలో కాలేజ్ యజమాన్యం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే శ్రీనిధి యూనివర్సిటీ పేరుతో ఇచ్చిన అడ్మిషన్లను.. శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీకి బదిలీ చేస్తామని గత నెలలో హామీ ఇచ్చారు. అయితే కాలేజ్ యాజమాన్యం చెప్పినట్టుగా ఆగస్ట్ 15న గడువు పూర్తైన బదిలీ చేస్తామని చేయడం లేదని వారు ఆరోపించారు. ఈ క్రమంలోనే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కాలేజ్‌లో ఆందోళనకు దిగారు. వారికి పలు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి.
