హోటల్ ఫుడ్స్ లో పురుగులు రావడం అప్పుడప్పుడూ వింటుంటాం.. అయితే సాక్షాత్ ఓ యూనివర్సిటీ హాస్టల్ మెస్ లో పురుగు రావడం.. అది అడిగినందుకు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం నిరసనలకు దారి తీసింది. 

హైదరాబాద్ : Osmania University మహిళా వసతి గృహంలో సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థినులు రోడ్డెక్కారు. ఆదివారం మధ్యాహ్నం లంచ్ టైంలో Ladies Hostel Messలో ఓ విద్యార్థినికి 
Chicken Curryలో పురుగు వచ్చింది. అది చూసిన ఆమె అక్కడి సిబ్బందిని నిలదీసింది. అయితే, వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో విద్యార్థినులంతా కలిసి వసతి గృహం ముందు రోడ్డు మీద బైఠాయించారు. ఉన్నత చదువుల కోసం తాము ఓయూకు వస్తే ఇక్కడ Toilets కూడా సరిగా లేవని, మంచి నీటి సౌకర్యం లేదని, నాణ్యమైన ఆహారం కూడా అందించడంలేదని వాపోయారు. 

మౌలిక సదుపాయాలు కల్పించకపోతే ఎలా చదువుకుంటామని ప్రశ్నించారు. నాణ్యమైన ఆహారం అందించాలని, నీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం 3.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఆందోళన కొనసాగింది. పోలీసులు నచ్చజెప్పడంతో శాంతించిన విద్యార్థినుల ఆందోళన విరమించారు. 

ఇదిలా ఉండగా, గన్నవరంలో ఇటీవల జిల్లాలోని ఓ ఉన్నత పాఠశాలకు చెందిన 9th class student విద్యార్థి Liquor తాగి schoolకు వచ్చిన వైనాన్ని ఉపాధ్యాయులు గుర్తించారు. వెంటనే ఆ విద్యార్థి తండ్రిని పిలిపించి మీ అబ్బాయి ప్రవర్తన బాగా లేదని.. అతన్ని మందలించాలంటూ చెప్పారు. అయితే అతను దీనికి సమాధానం చెబతూ.. ‘ఇంటి వద్ద మేము చెబుతున్నా వినడం లేదు.. మీరైనా చెప్పి.. వాడిని మార్చండి’.. అంటూ నిర్లక్ష్యంగా వెళ్లిపోయాడా కన్నతండ్రి. దీంతో teacherలే విద్యార్థిని గట్టిగా మందలించగా అతను ఉపాధ్యాయులకు ఓ letter రాసిచ్చాడు. ఆ విద్యార్థి రాసిచ్చిన లేఖను చూసి ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు. 

అందులో ‘నేను రోజుకు క్వాటర్ మద్యం తాగుతా.. పాఠశాలకు సమీపంలోని ఒక దుకాణంలో సిగరెట్లు కొనుక్కుని కాలుస్తున్నా.. పి గన్నవరంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుక్కుంటున్నా. ఆ డబ్బుల కోసం ఇటుకల బట్టిలో పనికి వెళ్తున్నా.. ఇకమీదట ఇలా చేయను..’ అంటూ పేర్కొన్నాడు. పాఠశాలలో ఐదుగురు వరకు విద్యార్థులు మద్యానికి అలవాటు పడ్డారని, అలాంటివారికి మంచి మాటలు చెబుతుంటే తల్లిదండ్రులే వారిని వెనకేసుకొస్తున్నారు.. అని ఉపాధ్యాయులు వాపోతున్నారు.