Asianet News TeluguAsianet News Telugu

ప్రగతి భవన్ ముందు ఉద్రిక్తత.. విద్యార్థి, యువజన సంఘాల నేతల అరెస్ట్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ ముందు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం ప్రగతి భవన్‌ ముట్టడికి విద్యార్థి, యువజన సంఘాలు యత్నించాయి. 

Student union leaders trying to protest at pragathi bhavan
Author
First Published Jan 9, 2023, 12:35 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ ముందు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం ప్రగతి భవన్‌ ముట్టడికి విద్యార్థి, యువజన సంఘాలు యత్నించాయి. పోలీసు నియామకాల్లో అవతవకలను నివారించాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే అప్రమత్తమైన పోలీసులు.. విద్యార్థి, యువజన సంఘాల నేతలను అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితి  నెలకొంది. విద్యార్థి, యువజన సంఘాల నేతలను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. 

ఇక, 1600/800 మీటర్లు రన్నింగ్ పాసైన అభ్యర్థులందరికి మెయిన్స్ ఎగ్జామ్‌కు అవకాశం కల్పించాలని విద్యార్థి, యువజన సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. 7 మార్కులు కలపాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని కోరుతున్నారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్స్ ప్రిలిమ్స్ పరీక్షలో తప్పు ప్రశ్నలకు మార్కులు కలపాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ యువమోర్చా కార్యకర్తలు ఈ నెల 5వ తేదీన ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో బీజేపీ యువమోర్చా కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios