చమురు కంపెనీలతో చర్చలు సఫలం

 దేశవ్యాప్తంగా శనివారం నుంచి చేపట్టనున్న నిరసన కార్యక్రమాన్ని పెట్రోల్‌ డీలర్లు వాయిదా వేశారు. ముంబయిలో చమురు కంపెనీలతో పెట్రోల్‌ డీలర్లు జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. లీటర్‌ పెట్రోలుకు రూ.138, లీటర్‌ డీజిల్‌పై రూ.102 కమిషన్‌ ఇచ్చేందుకు చమురు కంపెనీలు అంగీకరించాయి. మిగిలిన అంశాలపై చర్చిచేందుకు చమురు కంపెనీలు పది రోజులు గడువు కోరగా.. పెట్రోల్‌ డీలర్లు అంగీకరించారు.