హలీమ్ తినండి...ఐఫోన్ పొందండి

street byte organisation conduct haleem eating contest
Highlights

హైదరాబాద్ లో స్ట్రీట్ బైట్ సంస్థ వినూత్న కార్యక్రమం

రంజాన్ మాసంలో హలీమ్ తిననివారు ఉండరు. ముఖ్యంగా హైదరాబాద్ లో హలీమ్ రుచి చూడని వారు అరుదు. అలా రుచికరమైన హలీమ్ తినడమే ఆనందంగా బావిస్తుంటే...అది తిన్నందుకు ఐఫోన్ గిప్ట్ గా వస్తే...ఆ ఆనందానికి అవధులు ఉండవు. అలాంటి కాంటెస్ట్ నే స్ట్రీట్ బైట్ అనే సంస్థ బజాజ్ ఎలక్ట్రానిక్స్ తో కలిసి హైదరాబాద్ లో నిర్వహిస్తోంది.

అయితే ఐఫోన్ పొందాలంటే హలీం తింటూ ఓ సెల్పీ తీసుకుని దాన్ని పేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో  #haleemhungama, #bajajelectronics, #streetbyteలో అప్ లోడ్ చేయాల్సి ఉంటేందని నిర్వహకులు తెలిపారు. ఈ ఫోటోలు పంపిన వారిలోంచి లక్కీ డ్రా ద్వారా 30 మందిని ఎంపిక చేసి హైదరాబాద్ లో జరిగే హలీం కాంటెస్ట్ పంపుతామని నిర్వహకులు రవితేజ, ప్రసాద్ లు తెలిపారు.

ఈ కాంటెస్ట్ లో పాల్గొన్నవారిలో మరో పరీక్ష ఉంటుంది. నిర్వహకులు అందించే హలీంను ఎవరు ముందుగా తింటారో వారికి ఐఫోన్ ఎక్స్ ను బహూకరించనున్నారు. ఇక రెండు, మూడు స్థానాల్లో నిలిచిన వారికి ఐఫోన్8, ఐఫోన్ 7 ను అందించనున్నారు. 

అయితే ఇప్పటికే ప్రారంభమైన ఈ కాంటెస్టకు అనూహ్యమైన స్పందన లభిస్తోందని నిర్వహకులు తెలిపారు. హలీమ్ తో తింటూ సెల్పీ దిగుతూ చాలా మంది తమకు ఫోటోలు పంపుతున్నారని స్ట్రీట్ బైట్ సంస్థ తెలిపింది.

loader