గాయాలకు కుట్లకు బదులు ఫెవీక్విక్ తో అతికిస్తున్న దారుణ ఘటన గద్వాల జిల్లాలోని ఓ ఆస్పత్రిలో వెలుగు చూసింది. 

గద్వాల : గద్వాల జిల్లా అయిజాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ఆస్పత్రిలో గాయాలకు కుట్లు వేయడానికి బదులు ఫెవీక్విక్ తో అతికిస్తున్నారు. ఈ విషయం తాజాగా వెలుగు చూసింది. ఓ బాలుడికి ఆడుకుంటుండగా కంటివద్ద గాయం అయ్యింది. వెంటనే అతని తండ్రి ఆస్పత్రికి తీసుకువచ్చాడు. కాగా, వారు ఆ బాలుడికి ఫెవిక్విక్ తో అతికించే ప్రయత్నం చేయగా... నొప్పికి తట్టుకోలేక బాలుడు గట్టిగా కేకలు వేశారు. దీంతో తండ్రి వెళ్లి చూడగా.. సిబ్బంది నిర్వాకం వెలుగు చూసింది.

బాలుడి తండ్రి వెంటనే సిబ్బందినుంచి ఫెవిక్విక్ ట్యూబ్ లాక్కుని గొడవకు దిగాడు. ఫెవిక్విక్ పెట్టడం వల్ల తన కొడుకు కన్ను పోతే మీరు బాధ్యత వహిస్తారా? అంటూ వీడియో తీస్తూ ప్రశ్నించాడు. దీనికి సిబ్బంది మౌనంగా ఉన్నారు.ఆ తరువాత ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం మీద పోలీసులకు బాలుడి తండ్రి ఫిర్యాదు చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆస్పత్రికి వచ్చే మిగతా పేషంట్లు భయాందోళనల్లో ఉన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.