ప్రియురాలితో విభేదాలు రావడాన్ని తట్టుకోలేకపోయిన ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ జగద్గిరిగుట్ట సుభాష్ చంద్రబోస్‌నగర్‌లో విజయకుమార్, జేబీ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు.. రెండో కుమారుడు కార్తీక్ ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు.

అతను సూరారం ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో వారి మధ్య విభేదాలు రావడంతో నాలుగు రోజుల క్రితం యువతి ఇంటి వద్ద వాగ్వాదం జరిగింది..దీనిపై యువతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ప్రేమికులిద్దరికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

ఈ వ్యవహారంతో తీవ్ర మనస్తాపానికి గురైన కార్తీక్.. గత కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్నాడు. ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళితే మన:శాంతిగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో విదేశాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.

మరో నెలలో విదేశాలకు వెళుతున్న క్రమంలో..శనివారం సాయంత్రం ఇంట్లోని మరో గదికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. కుటుంబసభ్యులు గమనించేసరికి చనిపోయి కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.