వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఆదివారం రాత్రి కన్నుమూసింది. బాధిత ప్రీతి కుటుంబానికి తెలంగాణ సర్కార్ అండగా ఉండామనీ, 10 లక్షల రూపాయిలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. 

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి కన్నుమూసింది. సీనియర్ వేధింపులు భరించలేక ప్రీతి
ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను కాపాడేందుకు ప్రత్యేక వైద్యులు అన్నివిధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఐదురోజులుగా నిమ్స్ (NIMS) ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటూ ఆదివారం రాత్రి 9.10 గంటలకు మృతి చెందినట్లు ఆస్పత్రి ఓ అధికారికంగా ప్రకటన చేసింది. ప్రీతిని కాపాడేందుకు ప్రత్యేక వైద్య బృందం అన్నివిధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

ఈ ఘటనపై తెలంగాణ సర్కార్ స్పందించింది. ప్రభుత్వం స్పందించింది. బాధిత ప్రీతి కుటుంబానికి 10 లక్షల రూపాయిలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. అంతేకాదు.. ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, కేసీఆర్ ప్రభుత్వం భరోసా ఇచ్చింది. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం తెలిపింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈప్రకటన విడుదల చేశారు.