హైదరాబాద్‌: హైదరాబాద్ నగరంలో మెట్రోరైల్‌ సర్వీసులు నిలిచిపోయాయి. శనివారం ఉదయం ఎల్బీనగర్‌-మియాపూర్‌ రూట్‌లో సాంకేతిక లోపంతో మెట్రోరైల్‌ నిలిచిపోయింది. 

దాంతో ఆ రూటులో వెళ్లే మెట్రో రైల్ సర్వీసులకు బ్రేకులు పడ్డాయి.  మెట్రోస్టేషన్లలో ప్రయాణికుల పడిగాపులు పడుతున్నారు. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులకు మంచి ఆదరణ లభిస్తోంది. బుధవారంనాడు ప్రయాణికులను చేరవేసే విషయంలో హైదరాబాద్ మెట్రో రైలు రికార్డు సృష్టించింది. బుధవారంనాడు 2.60 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణించారు. 

ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపిఎల్ మ్యాచును వీక్షించేందుకు ఎక్కువ మంది మెట్రో రైళ్లలోనే వెళ్లారు. వారి సంఖ్య ఆ రోజు 21 వేలు ఉంది. రోజుకు 2.30 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారు.