భద్రాచలం: తెలంగాణలోని భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. వైద్యుడే అత్యంత నీచానికి ఒడిగట్టాడు. జిల్లాలోని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఈ దారుణం జరిగింది. 

స్టాఫ్ నర్సుపై వైద్యుడు అత్యాచారం చేశాడు. తన కోరిక తీర్చాలంటూ గత కొద్ది రోజులుగా వైద్యుడు ఆమె వెంట పడుతూ వచ్చాడు. ఈ నెల 24వ తేదీన అతను ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ నర్సుపై ఆ డాక్టర్ అత్యాచారం చేశాడు. 

బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.