Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో మరో ఐటీ కంపెనీ నిర్వాకం..180మంది గెంటివేత

‘‘ముప్పయి నిమిషాల సమయం ఇస్తున్నాం. రాజీనామా చేసి వెళ్లిపోండి’’ అంటూ హెచ్‌ఆర్‌ సిబ్బంది ఆదేశించారు. లేఆఫ్‌ ఉద్యోగులకు ఇచ్చే పరిహారాలేవీ ఇవ్వలేదు. ఇస్తామని కూడా చెప్పలేదు. 

Staff laid off at CDK Global

టెక్కీలకు కష్టకాలం నడుస్తోంది. సాఫ్ట్ వేర్ కంపెనీలు బలవంతంగా ఉద్యోగాలను కంపెనీ నుంచి తొలగిస్తున్నాయి.  ఈ ఏడాది మొదట్లో ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ 300 నుంచి 400 వరకు ఉద్యోగులను తొలగించగా.. ఇప్పుడు అదేబాటలో మరో కంపెనీ వచ్చి చేరింది. 

రహేజా మైండ్‌స్పేస్‌లో ఉన్న సీడీకే గ్లోబల్‌ ఇండియా సంస్థ గత శుక్ర, సోమవారాల్లో కలిపి 180 మంది ఉద్యోగులతో బలవంతంగా రాజీనామాలు చేయించింది.  పొద్దున్నే ఉత్సాహంగా ఆఫీసుకు వచ్చిన ఉద్యోగులను ‘‘ముప్పయి నిమిషాల సమయం ఇస్తున్నాం. రాజీనామా చేసి వెళ్లిపోండి’’ అంటూ హెచ్‌ఆర్‌ సిబ్బంది ఆదేశించారు. లేఆఫ్‌ ఉద్యోగులకు ఇచ్చే పరిహారాలేవీ ఇవ్వలేదు. ఇస్తామని కూడా చెప్పలేదు. 

నిబంధనల గురించి ప్రశ్నించిన వారిని ఐటీ రంగంలో మరెక్కడా ఉద్యోగం దొరక్కుండా చేస్తామని బెదిరించారు. దీంతో చేసేదేమీలేక ఆ ఉద్యోగులంతా తమకు ఇష్టం లేకపోయినా.. రాజీనామా చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ కంపెనీ సెడన్ గా తీసుకున్న ఈ నిర్ణయంతో వారంతా షాక్ కి గురయ్యారు. షాక్ నుంచి తేరుకున్న అనంతరం తమకు న్యాయం చేయాలని ఫోరమ్ ఫర్ ఐటీ ప్రొఫెషనల్స్ ని ఆశ్రయించారు.

రాష్ట్ర ప్రభుత్వం కార్మిక చట్టాల విషయంలో కఠినంగా ఉండకపోవడం వల్లే ఇటీవల ఐటీ రంగంలో అడ్డగోలు లేఆఫ్‌లు ఎక్కువయ్యాయని బాధితులు అంటున్నారు. ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఉద్యోగులను అకస్మాత్తుగా తొలగించడం నగరంలోని ఐటీ సంస్థల్లో ఏడాదికాలంగా యథేచ్చగా జరుగుతోంది.

లేబర్‌ కమిషనర్‌కు వినతి పత్రాలు జారీచేసి, కార్యాలయం ముంగిట ఆందోళనలు నిర్వహించడం తప్ప ఫలితమేమీ లభించడం లేదు. ఐటీ సంస్థలు కార్మిక శాఖ కార్యాలయానికి వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం లేదని, అలాంటి వారిపట్ల లేబర్‌ కమిషనర్‌ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు
 

Follow Us:
Download App:
  • android
  • ios