తెలంగాణలో స్టాడ్లర్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ: థావోస్ లో ఎంఓయూ

తెలంగాణలో స్టాడ్లర రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.  థావోస్ లో తెలంగాణ ప్రభుత్వంతో  మేథో సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, స్టాడ్లర్ రైల్  సంస్థ  చేసుకుంది. 
 

Stadler Railway Coach Factory in Telangana


హైదరాబాద్: Telangana లో Stadler రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. థావోస్ లో తెలంగాణ ప్రభుత్వంతో  మేథో సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, స్టాడ్లర్ రైల్  సంస్థ ఎంఓయూ కుదుర్చుకుంది.  

రాష్ట్రంలో ఉన్న మేధో సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, స్టాడ్లర్ రైలు సంయుక్తంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పనున్నాయి.  ఈ మేరకు స్టాడ్లర్ రైల్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అన్స్ గార్డ్ బ్రోక్ మెయ్, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ థావోస్‌లోని Telangana పెవిలియన్‌లో KTR  సమక్షంలో MOU పై సంతకాలు చేశారు.

Davos వేదికగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు వందల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.ఈ ఒప్పందం మేరకు రానున్న రెండేళ్లలో తెలంగాణలో రూ.1000కోట్లు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్థాపన కోసం కంపెనీ పెట్టుబడిగా పెట్టనుంది. ఈ కంపెనీ ఫ్యాక్టరీ స్థాపన తర్వాత తయారుచేసే రైల్వే కోచ్‌లను కేవలం భారత్‌తో పాటు ఏషియా పసిఫిక్‌ రీజియన్‌కు సైతం ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.  ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుతో సుమారు 2500 మందికి ఊపాధి దొరకనుంది.

తెలంగాణ రాష్ట్రంలో తమ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ముందుకు వచ్చిన స్టాడ్లర్ రైల్ కంపెనీకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి భారతదేశానికే కాకుండా విదేశాలకు సైతం ఎగుమతి అయ్యేలా రైల్వే కోచ్‌లను తయారు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.

also read:దావోస్‌లో సద్గురుతో కేటీఆర్ భేటీ.. హరిత హారం, సేవ్ సాయిల్ ఉద్యమంపై చర్చ.. హైదరాబాద్‌కు ఆహ్వానించిన మంత్రి

పెట్టుబడి ద్వారా తెలంగాణ రాష్ట్రం ప్రపంచ పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందనే విషయం మరోసారి నిరూపితమైందని మంత్రి చెప్పారు.  కంపెనీ పెడుతున్న రూ.1000కోట్ల పెట్టుబడి ద్వారా 2500 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని పేర్కొన్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న తమ యూనిట్ కంపెనీకి అత్యంత ప్రాధాన్యంగా మారబోతున్నదని అని కంపెనీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అన్స్ గార్డ్ బ్రోక్ మెయ్ తెలిపారు. తమ కంపెనీ ఏసియా పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధిని సాధించేందుకు ఈ పెట్టుబడి దోహదపడుతుందన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios