నిర్మల్ జిల్లాలో ఓ యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధుతుడిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న స్థానికులు దర్యాప్తు చేస్తున్నారు.  

నిర్మల్ జిల్లాలో (nirmal district) కత్తిపోట్ల (stabbing) ఘటన కలకలం రేపింది. ఓ యువకుడిని కత్తితో పొడిచి పరారయ్యారు కొంతమంది వ్యక్తులు. డాక్టర్స్ లేన్‌లోని ఓ ల్యాబ్‌లో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. దాడి చేసింది ఎవరో.. ఎందుకు చేశారు.. తదితర కారణాలను పోలీసులు అన్వేషించే పనిలో వున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.